అప్పుడు 'నేను' అన్నాడు..ఇప్పుడు 'నువ్వు' అంటున్నాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడలో ఉప్పి 2` సినిమాని రెండేళ్లు తెరకెక్కించాను. అక్కడ ప్రమోషన్స్ అంతా నా ఫ్యాన్స్ చూసుకున్నారు. చివరికి ఆడియో రిలీజ్ కూడా వాళ్ల ప్లానింగ్ ప్రకారమే జరిగింది. ఇది బుజ్జిగారికి నేను ఇస్తున్న బర్త్ డే గిఫ్ట్. నాకు ఆయన ఈ సినిమా హిట్‌తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనుకుంటున్నానని అన్నారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఉపేంద్ర`, రా` వంటి సినిమాతో తెలుగలో కూడా క్రేజ్ సంపాదించుకుని ఓకేమాట, కన్యాదానం వంటి సినిమాలతో తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. తాజగా ఉపేంద్ర రచయిత, దర్శకుడు కన్నడలో ఉప్పి`2` పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో ఉపేంద్ర`2` అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. నేను కాదు నువ్వు అనేది ఉపశీర్షిక. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి)ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిస్టినా అకిహివా హీరోయిన్స్. గురుకిరణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమం ఆగస్ట్ 9న హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు. తొలి సీడీని ఉపేంద్ర సతీమణి ప్రియాంక అందుకున్నారు. ఈ సందర్భంగా
ఉపేంద్ర మాట్లాడుతూ మనలో టాలెంట్ ఉండటం గొప్ప విషయం కాదు కానీ దాన్ని గుర్తించే టాలెంట్ ఇంకా గొప్పది. నాలోని చిన్న టాలెంట్‌ను గుర్తించి నన్నుఇంతమంది ప్రముఖులు మెచ్చుకుంటున్నందుకు హ్యపీగా ఉంది. గతంలో నల్లమలుపు బుజ్జిగారితో రా` సినిమా చేశాను. నా జీవితంతో గుర్తుండి పోయే సినిమా. ఆ సినిమాలోనే నా భార్య ప్రియాంకను కూడా కలిశాను. చాలా మొమరబుల్ ఇన్‌సిడెంట్స్ ఉన్న సినిమా. ఆ సమయంలో నాతో ఆ సినిమా చేసిన హిట్ ఇచ్చిన బుజ్జిగారు మళ్లీ నన్ను రా రా అని పిుస్తున్నారు. తెలుగులో సినిమా రిలీజ్ కి మరి కొంత సమయం ఉంటే బావుంటుంది కదా.. ఆలోచించుకోమని బుజ్జిగారితో అన్నాను. దానికి ఆయన ఇది నా సినిమా కన్నడంలో ఉప్పి`2` రిలీజ్ అయ్యే రోజునే తెలుగులో విడుద చేసే బాధ్యత నాది అని అనడమే కాకుండా మూడు రోజుల్లో సినిమాని రెడీ చేసేశారు. నువ్వు అనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమానే ఉపేంద్ర 2`. కన్నడలో రెండు సంవత్సరాలు సినిమా చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
వి.వి.వినాయక్: ఓం` సినిమా చూసినప్పటి నుండి ఉపేంద్రగారి సినిమాంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆయన డైరెక్షన్ టెన్షన్‌ను పక్కన పెట్టి హీరోగా సూపర్‌స్టార్ అయ్యారు. కానీ ఆయన అప్పుడప్పుడు సినిమా డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. నల్లములు బుజ్జి ఈ సినిమా కేవం ఉపేంద్రగారితో ఉన్న స్నేహంతో ఈ సినిమా చేస్తున్నాడు. ఎవరూ ఉహించని విధంగా సినిమా ఉంటుందని చెప్పగనుటీమ్‌కి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దిల్‌రాజు : తెలుగు ప్రేక్షకులకు సినిమా బావుంటే చాలు. భాషతో సంబంధం లేకుండా సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు. ఉపేంద్రగారు ప్రతి సినిమాని కొత్తగా చెయ్యాని ప్రయత్నిస్తుంటారు. తెలుగు మంచి విజయాలు సాధించారు. అలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియాంక, క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్, పరుచూరి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, గురుకిరణ్, ఛోటా కె.నాయుడు, వీరుపోట్ల, కొడాలి వెంకటేశ్వరరావు, గోపిచంద్ మలినేని, స్రవంతి రవికిషోర్, రాజా రవీంద్ర, వజ్ర శ్రీనివాస్, సింధూర పువ్వు కృష్ణారెడ్డి, శశాంక్ వెన్నెకంటి, వక్కంతం వంశీ, దామోదర్ ప్రసాద్, మల్లిరెడ్డి సత్యనారాయణ, కిషోర్ పార్థసాని, ఠాగూర్ మధు, మహేంద్ర, రఘుబాబు తదితరులు పాల్గొని యూనిట్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout