పవన్ మాట తప్పుతాడా...

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకి ఓ సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చాడు. ఇంకేముంది ద‌ర్శ‌క‌ర‌త్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ చేసే సినిమా నా బ్యాన‌ర్లోనే ఉంటుంది అన్నారు దాస‌రి. ప‌వ‌న్ తో దాస‌రి నిర్మించే చిత్రానికి క‌థాచ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయి త్రివిక్ర‌మ్ క‌థ అందిస్తున్నారు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆత‌ర్వాత ఈ సినిమాకి గోపాల గోపాల డైరెక్ట‌ర్ డాలీ స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నాడంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాస‌రి ప‌వ‌న్ తో సినిమా నిర్మిస్తున్నాన‌ని ప్ర‌క‌టించి సంవ‌త్స‌రం అవుతుంది. కానీ...ఈ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.
ఇటీవ‌ల స‌ర్ధార్ ఆడియో గురించి మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ ని దాస‌రి సినిమా గురించి అడిగితే...క‌థ కుదిరితే చేస్తాన‌ని చెప్పారు. అంటే దాస‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ కు త‌గ్గ క‌థ రెడీ చేయ‌లేద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే...ప‌వ‌న్ స‌ర్ధార్ త‌ర్వాత రెండు మూడు సినిమాలు మాత్ర‌మే చేస్తాను. ఆత‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తాన‌ని ప్ర‌క‌టించారు. స‌ర్ధార్ త‌ర్వాత ప‌వ‌న్ ఎస్.జె.సూర్య తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్రివిక్ర‌మ్ తో కూడా ప‌వ‌న్ ఓ సినిమా చేస్తాన‌న్నారు. మ‌రి..ప‌వ‌న్ చేసే రెండు మూడు సినిమాల్లో దాస‌రితో సినిమా ఉంటుందా..? లేక మాట త‌ప్పి ప‌వ‌న్ క‌థ కుద‌ర‌లేదని త‌ప్పించుకుంటాడో..? లేక మాట మీద నిల‌బ‌డి దాస‌రితో సినిమా చేస్తాడో చూడాలి.

More News

'24' గురించి డైరెక్టర్ ఏమన్నాడంటే...

ఇష్క్,మనం సక్సెస్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా,నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘24’.

అఖిల్ కూడా అదే బాటలో వెళతాడా?

అక్కినేని కుటుంబంలో మూడో తరం కథానాయకుడుగా తెరంగేట్రం చేశాడు అఖిల్.

రాజ్ తరుణ్ తో సందీప్ హీరోయిన్...

ఇప్పుడు వరుస విజయాల మీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఊపిరి కి ఫోర్బ్స్ పత్రిక అభినందన....

నాగార్జున-కార్తీ-తమన్నా కలిసి నటించిన ఊపిరి చిత్రం యు.ఎస్ లో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధిస్తుంది.గతంలో తెలుగు సినిమా యు.ఎస్ లో రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉండేది.

'అ..ఆ..'తోనైనా త్రివిక్రమ్ ట్రాక్ మారుస్తాడా?

మాటలతో మాయ చేయడం ఎంతబాగా తెలుసో..దృశ్యాలను కూడా ఆకట్టుకునేలా తీయడం రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే బాగా తెలుసు.