'మ‌హా స‌ముద్రం' అప్పుడైనా ఖ‌రార‌వుతుందా?

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

ఎంత క‌ష్ట‌ప‌డ్డా స‌రే! అవ‌గింజంత అదృష్టముండాల‌నే సామెత సినిమా రంగానికి ప‌క్కాగా సూట్ అవుతుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తిని చూస్తూ అది నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతుంది. ఎందుకంటే తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా ప‌లువురు హీరోల‌ను క‌లిశాడు. అంతా ఓకే అవుతున్న త‌రుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు నిర్మాత‌ల ద‌గ్గ‌ర స‌మ‌స్య వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ వ‌ద్ద‌కు చేరుకుంది. అయితే ఈలోపు క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా డిస్క‌ష‌న్స్ ఆగిపోయాయి. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే సినిమాకు సంబంధించిన బ‌డ్జెట్ త‌దిత‌ర విష‌యాలు ఫైన‌లైజ్ అవుతాయి. మ‌రి శ‌ర్వాంన‌ద్ ఈ బ్యాన‌ర్‌లో చేస్తాడా? లేక డిస్క‌ష‌న్స్ ప‌క్క దారి ప‌ట్టి ప్రాజెక్ట్ మ‌రో చోట‌కు వెళుతుందా? అనే విష‌యాలు తెలియాల్సి ఉన్నాయి. మ‌రి అజ‌య్ భూప‌తి ‘మ‌హా స‌ముద్రం’ ఎప్పుడు షురూ అవుతుందో తెలియాలంటే మ‌రికొన్ని వెయిట్ చేయాల్సి రావ‌చ్చు.

More News

క‌రోనా క్రైసిస్ లో తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన 'తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌'

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌..కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైయ్యాడు. రెండు, మూడు సంద‌ర్భాల్లో ఇంటిలో ఉండాలంటూ లేక‌పోతే మ‌రింత క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ

నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు.

'ఆర్ఆర్ఆర్‌'పై పున‌రాలోచ‌న‌లో దిల్‌రాజు ?

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న

ఎల్లుండి 9 నిమిషాలు నాకివ్వండి : మోదీ

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ సారి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరోసారి దేశ ప్రజలకు వెరైటీ పిలుపునిచ్చారు.