పవన్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. ఇక పోలీస్ స్టేషన్ లో..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రంపై ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ ఉంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇదీ చదవండి: పిక్ టాక్: బికినీలో రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి
ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తయింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ తొలి రోజు నుంచే పవన్ షూట్ లో పాల్గొననున్నాడు.
ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో పవన్, రానా మధ్య కీలక సన్నివేశల చిత్రీకరణ జరగనుంది. పవన్, రానా ముఖాముఖీ తలపడే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయట.
ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానాకు జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. మలయాళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు.
రానా మరోవైపు విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లులో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com