క్రిష్ మాటలను పవన్ వింటాడా..?

  • IndiaGlitz, [Friday,June 05 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆ క‌మ్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమాల షూటింగ్ ఆగింది. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అందులో ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పీరియాడిక‌ల్ మూవీ. మ‌రో చిత్రం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల‌పై ఇప్పుడు క‌రోనా ప్ర‌భావం బాగానే చూపుతుంది.

క్రిష్‌, హరీశ్‌ శంక‌ర్ సినిమాల్లో దేన్ని ముందుగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ప‌వ‌న్ ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. క్రిష్ సినిమా పీరియాడిక‌ల్ మూవీ, భారీ సెట్స్‌తో అవ‌స‌రం ఉంది. ఇది పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. కాబ‌ట్టి ముందుగా హ‌రీశ్ శంక‌ర్ సినిమాను తీసుకెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అయితే క్రిష్ ముందుగా త‌క్కువ మంది ఉండే యూనిట్‌తో స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రించి త‌ర్వాత భారీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాన‌ని ప‌వ‌న్‌కు క్రిష్ స‌ర్ది చెబుతున్నాడ‌ట‌. మ‌రి క్రిష్ మాట‌ల‌ను ప‌వ‌న్ వింటాడా? విని, క్రిష్ సినిమాను ముందుగా పూర్తి చేస్తాడా? అని చూడాలి.