మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.
మాస్క్‌ల కొరత!
ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. అయితే.. మాస్క్‌లు మాత్రం ఎక్కడా దొరకట్లేదు. ఒక వేళ దొరికినా రూపాయిల్లో ఉండే ధర వందలు, వేలకు పాకింది. దీంతో మాస్క్‌లు దొరక్క జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించి ఓ ఉపాయం చెప్పారు. టిష్యూలతో మాస్క్‌లు చేయడం ఎలా..? అనేది ఓ వీడియో రూపంలో ఆమె చెప్పారు.
ఇలా తయారు చేస్కోండి!
మెడికల్ షాపుల్లో మాస్కులు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోందని.. అయితే టిష్యూతోనూ మాస్కులు తయారు చేసుకోవచ్చని వీడియోలో నిశితంగా ఆమె చూపించారు. ‘కరోనాపై భయం వీడి బాధ్యతతో వ్యవహరించాలి. అవసరం ఉంటేనే మాస్కు ధరించాలి. మీకు కరోనా ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు.. ఇతరులకు కరోనా సోకినట్టు అనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలి. మాస్కును తొలగించిన తర్వాత దాన్ని విధిగా చెత్తబుట్టలోనే వేయాలి’ అని వీడియోలో ఉపాసన వివరించారు. కాగా.. కరోనా నేపథ్యంలో పలువురు నటీనటులు తమకు తోచిన సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
Hey guys this is just a glimpse. Find out all what u need to know about masks,sanitisers & protecting urself.
— Upasana Konidela (@upasanakonidela) March 5, 2020
DO NOT PANIC ! Save masks for people that are sick & the elderly > 60
Check out : https://t.co/9k6gUBKKGs for more @HospitalsApollo @ApolloFND pic.twitter.com/N9gL6MFvwo
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout