మోదీని ప్రశ్నించిన ఉపాసన కొణిదెల!
Send us your feedback to audioarticles@vaarta.com
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల తెలుగు సినీ ప్రముఖులు అసంతృప్తిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మోదీ సర్కార్‌ను తిట్టిపోస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారినే ఆహ్వానించారు. దీంతో తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాసన రియాక్షన్ ఇదీ..
ఈ వ్యవహారంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.‘డియర్ నరేంద్ర మోదీ గారు.. మేము సౌత్ ఇండియన్స్.. మీ పాలనని అభిమానిస్తూ, మీరు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాం. కానీ మీ దృష్టిలో సినీ సెలబ్రిటీస్ మరియు కల్చరల్ ఐకాన్స్ కేవలం హిందీకి మాత్రమే పరిమితమా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే ప్రశ్నిస్తున్నా.. ఇది మీకు కరెక్ట్‌గా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ఉపాసన అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఉపాసనకు ఎంతో మంది నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. అయితే చెర్రీ సతీమణి రియాక్షన్‌కు పీఎంవో నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com