Athamma's Kitchen: అత్తమ్మకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్.. 'అత్తమ్మ కిచెన్' ప్రారంభించిన ఉపాసన

  • IndiaGlitz, [Monday,February 19 2024]

పద్మవిభూషణ్, మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజుకు ఆమె కోడలు ఉపాసన మర్చిపోలేని తీపిగుర్తు అందించారు. వీరి మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకుని మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి అత్తమ్మ సురేఖతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ సందర్భంగానే తన అత్తమ్మ పుట్టినరోజుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఏకంగా 'అత్తమ్మ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు.

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా చూపిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తన అత్త సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా 'అత్తమ్మ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు. అది కూడా సురేఖ పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ సిద్ధం చేస్తుండేవారు. అందుకే కొణిదెల వంటకాలను అత్తమ్మ కిచెన్ ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు ద్వారా వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాసన తన బిజినెస్‌ టెక్నిక్స్ ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తతో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది.

సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా అత్తమ్మ కిచెన్ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.'అత్తమ్మ కిచెన్' ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

ఇక ఉపాసన విషయానికొస్తే ఇప్పటికే అపోలో ఫార్మసీ విభాగాన్ని చూస్తున్న ఆమె.. ఇటీవల చైల్డ్ కేర్‌ని ప్రారంభించారు. పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్‌ చేసేలా తన దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు మెగా వారింట్లో కోడలిగా, ఇల్లాలుగా, క్లీంకారకి తల్లిగా, వ్యాపారవేత్తగా ఇలా మల్టీఫుల్‌ వర్క్ చేస్తూ ఎంతో మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

More News

కుర్చీ మడతపెట్టి చంద్రబాబును ఇంటికి పంపించారు.. సీఎం జగన్ పంచ్‌లు..

వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని సీఎం వైయస్ జగన్ తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాలకు సంబంధించి

Peach Candy:పీచుమిఠాయి తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. నిషేధం విధించిన ప్రభుత్వం..

పీచు మిఠాయి అంటే మనకి చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తుంటాయి. చిన్నపుడు రోడ్లు మీద పీచు మీఠాయిని తెగ ఆరగించేవాళ్లం కదా.

Siddham: సీమలో వైసీపీ పొలికేక.. రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభకు 'సిద్ధం'..

'సిద్ధం' సభలతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. వైసీపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపారు.

Dangal Actress:చిత్ర పరిశ్రమలో విషాదం.. దంగల్ నటి కన్నుమూత..

హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్‌ ఖాన్‌ 'దంగల్‌' మూవీలో నటించిన బాలనటి సుహాని భట్నాగర్ కన్నుమూసింది.

Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్య్ర భారతంలోనే అతి పెద్ద కుంభకోణం: ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.