Athamma's Kitchen: అత్తమ్మకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్.. 'అత్తమ్మ కిచెన్' ప్రారంభించిన ఉపాసన
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజుకు ఆమె కోడలు ఉపాసన మర్చిపోలేని తీపిగుర్తు అందించారు. వీరి మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకుని మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి అత్తమ్మ సురేఖతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ సందర్భంగానే తన అత్తమ్మ పుట్టినరోజుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఏకంగా 'అత్తమ్మ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు.
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా చూపిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తన అత్త సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా `అత్తమ్మ కిచెన్` పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు. అది కూడా సురేఖ పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ సిద్ధం చేస్తుండేవారు. అందుకే కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు ద్వారా వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాసన తన బిజినెస్ టెక్నిక్స్ ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తతో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది.
సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.'అత్తమ్మ కిచెన్' ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు.
ఇక ఉపాసన విషయానికొస్తే ఇప్పటికే అపోలో ఫార్మసీ విభాగాన్ని చూస్తున్న ఆమె.. ఇటీవల చైల్డ్ కేర్‌ని ప్రారంభించారు. పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేసేలా తన దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు మెగా వారింట్లో కోడలిగా, ఇల్లాలుగా, క్లీంకారకి తల్లిగా, వ్యాపారవేత్తగా ఇలా మల్టీఫుల్ వర్క్ చేస్తూ ఎంతో మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout