Upasana:డెలివరి కాకముందే ఉపాసనకి .. ఊయల గిప్ట్ , దానికో స్పెషాలిటీ .. ఎవరు పంపారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు అభిమానులకు, కుటుంబ సభ్యులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దినెలల క్రితం ఉపాసన గర్భం దాల్చారు. ఈ వార్త తెలియగానే మెగా - కామినేని ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆనాటి నుంచి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఆమె మెగా వారసుడిని అందించనున్నారు చరణ్ కపుల్.
ఉపాసనను బహుమతులతో ముంచెత్తుతోన్న ఫ్యామిలీ :
ఉపాసన గర్భం దాల్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు అమెకు విషెస్ తెలియజేస్తున్నారు. అంతేకాదు.. కొందరు ఆమెకు గిఫ్ట్స్ కూడా పంపుతున్నారు. తాజాగా ఉపాసనకు ఊయలను బహుమతిగా పంపి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు. కలపతో ఎంతో అద్భుతంగా చేసిన ఆ ఊయలను చూస్తూ ఉపాసన మురిసిపోతున్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. అది బలం, ఆత్మగౌరవం, ఆశకి ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుందని ఉపాసన పేర్కొన్నారు.
అపోలో ఫౌండేషన్ ద్వారా ఉపాసన సామాజిక కార్యక్రమాలు :
అంతా బాగానే వుంది కానీ.. ఇంతకీ దానిని ఎవరు పంపారనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. భర్త సినిమాలతో బిజీగా వుంటుంటే.. కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలను ఉపాసన పర్యవేక్షిస్తున్నారు. తద్వారా చరణ్‌కు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా వుంటున్నారు. తొలి నుంచి సామాజిక సేవలో ముందుండే ఉపాసన పెళ్లయిన తర్వాత కూడా అదే స్థాయిలో తన సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎన్నో వందల జంతువులను కూడా ఉపాసన సంరక్షిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా మహమ్మారి సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆమె, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం వైద్యం అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన ముందుంటారు. తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ఆమె ముందుకొచ్చారు. అక్కడ తలదాచుకుంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహిళల చేతుల్లో రూపు దిద్దుకున్న ఊయల:
గతంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఉపాసన విరాళాలు అందించడంతో పాటు అండగా నిలిచారు. అలాంటి వాటిలో ఒకటైన ప్రజ్వల ఫౌండేషన్‌కు చెందిన కొందరు మహిళలు ఉపాసనకు ఈ ఊయలను గిఫ్ట్‌గా పంపారు. దీనిని మహిళలే స్వయంగా వారి చేతులతో చేశారు. సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న మహిళలను కాపాడి, వారికి తిరిగి జీవితాన్నిచ్చేందుకు ప్రజ్వల ఫౌండేషన్ కృషి చేస్తోంది.
We are honoured & humbled to receive this heartfelt gift from the incredible young women of #PrajwalaFoundation.
— Upasana Konidela (@upasanakonidela) June 17, 2023
This handcrafted cradle holds immense significance, symbolizing strength, resilience & hope.
It represents a journey of transformation and self-respect that I want… pic.twitter.com/njRU4SfnaO
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments