కేటీఆర్‌కు ఉపాసన కొణిదెల సరదా ప్రశ్న!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కార్యక్రమాలను షేర్ చేస్తూ అటు మెగాభిమానులు.. ఇటు కామినేని అభిమానులను టచ్‌లో ఉంటారు. కాగా.. దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వార్షిక సమావేశాలకు ఉపాసన హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు గాను ప్రభుత్వం తరఫున ఆమె కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
ఇందులో భాగంగా పలు కంపెనీలకు ఉపాసన సమాచారం ఇచ్చి .. పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరులను నిశితంగా వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కూడా ఆమె కలిశారు. ప్రపంచంలోని అత్యాధునిక హెల్త్ కేర్ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలసి పని చేయబోతున్నట్లు ఉపాసన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నాదెళ్లతో కలిసిన ఫొటోలను కూడా ట్వి్టర్లో ఆమె పోస్ట్ చేశారు. కాగా ఉపాసనతో పాటు మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డెస్క్‌లో కాసేపు కూర్చున్న ఆమె నాలుగైదు ఫొటోలను క్లిక్ అనిపించి.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఉపాసన ట్వీట్ సారాంశం:
ఆ ఫొటోలతో పాటు "నా కొత్త జాబ్ ఎలా ఉంది సార్?" అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సరదాగా ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఏంటి మేడమ్ కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారా..? ఏంటి మేడమ్.. మీరు కూర్చుండే చైర్‌ను.. మీ వెనక భాగానున్న తెలంగాణ ప్రభుత్వం లోగో ఎందుకొచ్చింది..? అంటూ అభిమానులు ట్విట్టర్లో సరదాగా కామెంట్స్ చేయడం మొదలెట్టారు.
కాగా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కేటీఆర్.. ఉపాసన సరదా ప్రశ్నకు ఎలా రియాక్టవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి. సాయం చేయండి సార్.. అని ట్విట్టర్లో చిన్న ట్వీట్ చేస్తే చాలు అంతే తొందరగా రియాక్టయ్యి తన వంతుగా కేటీఆర్ సాయం చేస్తున్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments