పర్ ఫెక్ట్ టైమ్ లో ధృవ ఆడియో - ఉపాసన..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తని ఓరువన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంటే...విలన్ గా అరవింద్ స్వామి నటిస్తున్నారు. హిప్ హప్ తమీజా సంగీతం అందించిన ధృవ ఆడియోను ఈరోజు రాత్రి 12 గంటలకు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ... ధృవ మ్యూజిక్ రాత్రి 12 గంటలకు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. నాలా నిద్రపట్టని వాళ్లకు పర్ ఫెక్ట్ టైమ్ అది అని తెలియచేసారు. ఈ చిత్రంలోని చూసా చూసా ఓ హృదయాన్ని...కలిసా కలిసా ఆ హృదయాన్ని అనే సాంగ్ ప్రొమోను ఇటీవల రిలీజ్ చేసారు. విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ వలే ఈ చిత్రంలోని మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి అని ఆశిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments