జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా అప్ సైకిల్డ్ గణేష్ నవరాత్రులు!
Send us your feedback to audioarticles@vaarta.com
గణపతిబప్పా.. మోరియా’ అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ ‘గణేష్ చతుర్థి’. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు. కుటుంబమంతా కలిసి జరుపుకొనే ఈ వేడుకను జీ తెలుగు మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సిద్ధమైంది. పాశ్చత్య పోకడలకు భిన్నంగా పర్యావరణ హితమైన గణేష్ విగ్రహ ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. జీ తెలుగు ఆధ్వర్యంలో 100% పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించనున్నారు. వినాయక చవితి పర్వదినానశ్రీసాయిహైట్స్, యూఎంసీసీరోడ్డు, నవోదయకాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్-72 చిరునామాలో ఈ ఎకోఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.
పర్యావరణ సంరక్షణలో భాగంగా జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గణేష్ మండపం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపంలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం జీరో వేస్ట్ కాన్సెప్ట్తో పూర్తిగా పునర్వినియోగ వస్తువులతో నిర్మించబడింది.‘ఆరంభం ఒక్క అడుగుతోనే’ అంటూ ప్రతిక్షణం స్ఫూర్తినింపే జీ తెలుగు పర్యావరణ రక్షణలోనూ మొదటి అడుగు వేసింది.ఇక, ఈ వినాయక విగ్రహాన్ని తయారుచేయడానికిజీ తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాలను తెరకెక్కించడానికి వినియోగించే పరికరాలను ఉపయోగించారు. ప్రేక్షకులకు విభిన్నమైన కార్యక్రమాలతో వినోదం అందించడంలో ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు గణేష్ ఉత్సవాలను అంతే ఆలోచనాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మండపంలో జీ తెలుగు నటీనటులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యావరణ హితమైన వినాయక విగ్రహాన్ని భక్తులుకూడా దర్శించుకోవచ్చు.
ఈప్రయోగాత్మక, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఈ వినాయక విగ్రహాన్ని పూర్తిగా సెట్ ప్రాపర్టీస్ నుండి రూపొందించారు. జీతెలుగు పర్యావరణ శ్రేయస్సులోబాధ్యతాయుతమైనపాత్రను పోషించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది.వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న ప్రతిష్టించిన ఈ పర్యావరణ హితమైన గణేష్ విగ్రహం వెలుగులు విరజిమ్ముతూ సందర్శకులకు ప్రత్యేక అనుభూతినిస్తుంది.ఈవిగ్రహంని 11 రోజులు సందర్శకులు దర్శించవచ్చు.
ఈప్రత్యేకమైన వినాయక విగ్రహాన్ని రూపొందిచడానికిమైక్రోఫోన్లు, స్పీకర్లు, లైట్లు, లెడ్ కేబుల్, సౌండ్ స్పీకర్ బబుల్స్, మైక్, LED లైట్ రిమోట్, చెవుల్లో లైట్లు, వేళ్లలో కెమెరా వస్తువులు, అరచేతుల్లో లైట్ హోల్డర్లు, నెక్లెస్ రంగురాళ్లతో, కాస్ట్యూమ్స్, ల్యాండ్ హ్యాండ్ కెమెరా క్లిప్‌లు, రోప్ లైట్లు, తల వెనుక ఊఫెర్స్, మిర్చి లైటింగ్తో పళ్లు,కెమెరా, షూట్ లైట్, మేకప్ మిర్రర్, సింగింగ్ మిక్ మరియు వైర్లతో సహా వివిధ సెట్ ప్రాపర్టీలను వినియోగించారు. పర్యావరణానికి హాని కలిగించకూడదనే సదుద్దేశంతో రూపొందించిన ఈ గణపతి విగ్రహాన్ని జాగ్రత్తగా విచ్ఛిన్నం చేసి ఆయా పరికరాలను తిరిగి సెట్స్ కి పంపిస్తారు. పర్యావరణ సంరక్షణలో భాగంగా జీ తెలుగు ప్రారంభించిన ఈ ప్రయాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com