అప్పటి వరకూ నేలపైనే పడుకుంటా: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లోనే ఉండిపోయారు. చాతుర్మాస దీక్ష గురించి.. తాను ఎప్పటి నుంచి చేస్తున్నది.. తదితర విషయాల గురించి పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘2003 నుంచి చేసుకుంటూ వస్తున్నా.. అంతకు ముందు అయ్యప్పస్వామి మాలల వంటివి వేసే వాడిని. ఈ చాతుర్మాస దీక్ష గురించి మాత్రం బయటకు తెలియదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండటం వల్ల బయటకు వచ్చింది. విష్ణుమూర్తి శయనించే కాలమిది. అందుకే ఆయన భక్తులందరూ ఈ దీక్ష చేస్తారు. ఇది కార్తీక మాసం దాటే వరకూ ఉంటుంది. అప్పటి వరకూ నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తా.. నేలపైనే పడుకుంటా’’ అని పవన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments