అప్పటివరకు అంతా వెయిట్ చేయాల్సిందే: పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Saturday,July 25 2020]

శ్రీ పవన్ కల్యాణ్ గారు నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. . కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారి సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ... ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ పవన్ కల్యాణ్ గారు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రశ్న: మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా?

కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.

More News

ఆర్జీవీకి ఉస్మానియా జేఏసీ నేత వార్నింగ్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసు వద్దకు వెళ్లిన విషయమై ఉస్మానియా జేఏసీ నేత సంపత్ నాయక్ మీడియాతో మాట్లాడారు.

ప్రజల మధ్యే కరోనా బాధితులు.. తెలంగాణలో సర్వం అస్తవ్యస్తం

తెలంగాణ పరిస్థితి సర్వం అస్తవస్త్యంగా మారుతోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఆ క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి: పవన్

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టారు.

నాగశౌర్య కొత్త చిత్రం ప్రీలుక్ విడుదల

యువ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో

‘పవర్ స్టార్’కి లైక్ కొట్టి.. ప్రామిస్.. పొరపాటున జరిగిందన్నబండ్ల గణేష్

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నోరు జారడం కొత్తేమీ కాదు.. ఈసారి కొత్తగా చెయ్యి జారి సారీ చెప్పారు.