Unstoppable - 2: ఇప్పటినుండి నువ్వు నన్ను అలానే పిలవాలి - ప్రభాస్ తో బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ (NBK)హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ 2 షోకి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సీజన్‌లో ప్రభాస్ (Prabhas) పాల్గొన్న ఎపిసోడ్ కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అది ఎంతలా అంటే ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. ‘‘అన్‌స్టాపబుల్ 2’’ షో కోసం గురువారం అర్ధరాత్రి గడియారంలో ముల్లు పన్నెండు మీదకు రాగానే ప్రపంచవ్యాప్తంగా వున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఆహా యాప్ మీద క్లిక్ చేయడంతో అది క్రాష్ అయ్యింది. ఆహా టెక్నికల్ టీమ్ ఎంతో కష్టపడి సమస్యను సరిదిద్దింది. తమ అభిమాన నటుడి అల్లరి, బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం చెప్పాడోనని వారు ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఏం లేకుండానే గోల చేస్తున్నారు :
ఇక.. అన్‌స్టాపబుల్ 2 (Unstoppable2)లో ఎన్నో ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం చెప్పారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి కృతి సనన్ (kriti Sanon)తో డార్లింగ్ రిలేషన్‌లో వున్నారని.. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపైనే బాలయ్య ప్రశ్నలు సంధించారు. కెరీర్‌లో నువ్వు ఎంతోమంది హీరోయిన్స్‌తో నటించావు.. కానీ రాముడు సీతతోనే ప్రేమలో ఎందుకు పడ్డాడంటూ పరోక్షంగా కృతి సనన్ ఇష్యూని బాలకృష్ణ ప్రస్తావించారు. దీనికి ప్రభాస్ ఏమాత్రం తడబడకుండా ఆన్సర్ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని.. తమ మధ్య ఏం లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారని యంగ్ రెబల్ స్టార్ స్పష్టం చేశారు.
నీకు కాబోయే అమ్మాయి.. ఆ అమ్మాయి చౌదరినా, శెట్టినా, సననా :
అనంతరం కెరీర్‌లో ఏ దర్శకుడితో కలిసి పనిచేయాలనుకుంటున్నావని బాలయ్య ప్రశ్నించగా.. మణిరత్నం అని ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్ (Prabhas). అలాగే బాపూ అంటే తనకు ఇష్టమని బాలకృష్ణ తెలిపారు. ఈ ఎపిసోడ్ మధ్యలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు బాలయ్య ఫోన్ చేయడం హైలైట్‌గా నిలిచింది. త్వరలోనే డార్లింగ్ మీ అందరికీ గుడ్‌న్యూస్ చెబుతారని సంకేతాలిచ్చారు. మధ్యలో జోక్యం చేసుకున్న బాలయ్య.. ఆ అమ్మాయి చౌదరినా, శెట్టినా, సననా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆన్సర్ తాను చెప్పలేననే మీరే ఊహించుకోవాలంటూ చరణ్ బాలయ్యతో అన్నారు. దీనికి ప్రభాస్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్, నువ్వు నా ఫ్రెండ్‌వా, శత్రువా అంటూ నవ్వులు పూయించారు.
నన్నూ డార్లింగేనని పిలువు :
ఈ క్రమంలోనే నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతారు.. నేను కూడా నీ మాయలో పడిపోయానంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఇంతకీ పెళ్లి వుందా లేదా అని ఆయన అడుగుతారు. దీనికి డార్లింగ్ స్పందిస్తూ... రాసిపెట్టి లేదు సార్ అని ఆన్సర్ ఇస్తారు.దీనికి బాలయ్య కూడా వెంటనే మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకయ్యా అని కౌంటర్ వేశారు. అలాగే నిన్ను గర్ల్‌ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని బాలయ్య చిలిపిగా అడిగితే.. అదేదో ట్యాబ్లెట్ వేసుకున్నా సార్..అన్ని మరిచిపోతున్నా అని ప్రభాస్ తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.నన్ను ఏమని పిలుస్తావంటే డార్లింగ్ సార్ అంటానంటూ చెప్పాడు.. లేదు ఇకపై నన్ను కూడా డార్లింగే అనాలని బాలయ్య పట్టుబట్టారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com