Unstoppable 2:టీడీపీలో చేరమన్న బాలయ్య.. పవన్‌ని సినిమాలు మానేయమంటున్న ఫ్యాన్స్ , అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం ఈ సీజన్లో ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఎపిసోడ్ .. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ది. ఇంతకుముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ 2 రికార్డులు క్రియేట్ చేయగా.. తాజాగా వాటన్నింటిని పవన్ ఫస్ట్ ఎపిసోడ్ బద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీ స్టీమింగ్ అయిన తొలి ఎపిసోడ్లో పవన్ వ్యక్తిగత విషయాలు, సినిమాలు, మూడు పెళ్ళిళ్లకు సంబంధించిన అంశాలను చూపించారు నిర్వాహకులు. దీంతో సెకండ్ పార్ట్‌లో ఏం చూపిస్తారా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో పవన్ పొలిటికల్ లైఫ్‌ని టచ్ చేశారు బాలయ్య.
చాలా కాలం తర్వాత తిక్క లేచింది :
కొద్దిరోజుల క్రిందట పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన సందర్భంగా కారు టాప్‌పై కూర్చొని ప్రయాణించిన ఫోటోను ప్రోమో మొదట్లో డిస్ ప్లే చేశారు. దీనిని చూపిస్తూ ఏంటా గొడవ అని పవన్‌ను ప్రశ్నించారు బాలయ్య. దీనికి పవన్ కూడా ఘాటుగా బదులిచ్చారు. ‘‘కారులో వెళ్లకూడదు, కారులో నుంచి బయటకు రాకూడదు, రూమ్‌లో వుండకూడదు.. రూమ్ నుంచి బయటకు రాకూడదు అనే ఆంక్షలు విధించారని , దీంతో తనకు చాలా రోజుల తర్వాత కొంచెం తిక్క వచ్చిందన్నారు. ఇక ఎప్పుడూ రెండు జేబుల్లో చేతులు పెట్టుకోవడంపై బాలయ్య ప్రశ్నించారు. ఎవరినీ కొట్టకుండా ఉండేందుకే చేతులు లోపల పెట్టుకుంటున్నావా అని పంచ్ వేశారు బాలకృష్ణ.
అభిమానం ఓట్లుగా ఎందుకు మారలేదంటే:
సరదాగా సాగిపోతున్న సమయంలో కొత్తగా పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని పవన్‌ను బాలయ్య ప్రశ్నించారు. అలాగే 2019 ఎన్నికల నాటి జనసేన మేనిఫెస్టో జనాల్లోకి సరిగ్గా వెళ్లకపోవడం వల్లే విజయం దక్కలేదేమో అని బాలయ్య అడగ్గా.. దీనికి పవర్‌స్టార్ ఏదో ఆన్సర్ ఇచ్చారు. రాష్ట్రంలో పవన్ ఫ్యాన్ కానటువంటి వారెవరూ లేరు.. మరి ఆ అభిమానం ఓటుగా ఎందుకు మారలేదని బాలయ్య ప్రశ్నించారు. ఆ సమయంలో రాజకీయ పార్టీల ఆధిపత్య ధోరణిని పవన్ వివరించే ప్రయత్నం చేశారు. ఆ కాసేపటికి ఓ వృద్ధురాలు స్టేజ్‌పైకి వచ్చిన సన్నివేశం కంటతడి పెట్టించింది. పవన్ సీఎం అయిన తర్వాతే తాను చనిపోతానని చెప్పింది.
సింహం, పులి మధ్యలో తల వుందన్న క్రిష్:
తర్వాత పవన్‌తో ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న క్రిష్ వేదికపై సందడి చేశారు. మా ఇద్దరితో నువ్వు పనిచేశావు కదా.. ఇద్దరి మధ్యా తేడా ఏంటని బాలయ్య క్రిష్‌ని ప్రశ్నించారు. దీనికి ఆయన సింహం, పులి మధ్యలో నా తల వుందంటూ తెలివిగా తప్పించుకున్నాడు. అనంతరం క్రిష్ స్టేజ్ దిగి జనం మధ్యలోకి వెళ్లి కూర్చొన్నాడు. పవన్ పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలకే పరిమితం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారని బాలయ్య అడగ్గా.. దానికి మెజారిటీ ఆడియన్స్ ‘‘ఎస్’’ అని సమాధానమిచ్చారు. ఆ వెంటనే పవన్ ఏదో రాస్తుండగా.. ఏంటయ్య అపాలజీ లెటర్ రాస్తున్నావా అని బాలయ్య సెటైర్ వేశారు.
టీడీపీలో చేరాల్సిందిగా పవన్‌కు బాలయ్య ఆఫర్ :
మధ్యలో సడెన్‌గా బాలయ్య.. ‘‘నువ్వు తెలుగుదేశంలో చేరి వుండాల్సింది’’ అని ప్రశ్నించగా.. దీనికి పవన్ ఏం సమాధానం చెప్పారో మాత్రం చూపించలేదు. చివరిలో అణువు, అణుబాంబు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌తో ప్రోమో ముగించారు. మొత్తంగా ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలతో సెకండ్ ఎపిసోడ్ హీటెక్కిపోయింది. దీనిని ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామని ఆహా ప్రకటించింది. దీంతో ఈ ఎపిసోడ్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments