సోనూసూద్‌కు ఐక్యరాజ్యసమితి అవార్డ్
- IndiaGlitz, [Tuesday,September 29 2020]
సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ కోవిడ్ ఎఫెక్ట్‌లో వేలాది మంది వలస కార్మికులను వారి ఊర్లకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. వెండితెరపై విలన్‌గా ఉన్న సోనూసూద్ ఈ చర్యలతో నేషనల్ హీరో అయ్యాడు. ఈయన ప్రజలకు అందించిన సేవలకుగానూ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనూసూద్‌కు ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సోనూసూద్‌కు సోమవారం జరిగిన ఓ వర్చువల్ క్యారక్రమంలో ప్రదానం చేశారు. ఈ అవార్డు స్వీకరించిన ఎంజలీనా జోలీ, బెక్‌హామ్, లియొనార్డో డి కాప్రియో, ప్రియాంక చోప్రా తదితరుల లిస్టులో సోనూసూద్‌కు చేరాడు.
‘‘ఐక్యరాజ్యసమితి నుండి అవార్డు తీసుకోవడం చాలా ప్రత్యేకం. అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను చేయగలిగిన కొద్దిపాటి సహాయాన్ని నాకు తగినట్లు, వీలైనంత మేరకు చేశాను. నా చర్యలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి అవార్డును అందించడం చాలా ఆనందంగా ఉంది. యు.ఎన్.డి.పి అభివృద్ధి లక్ష్యాలు చేరుకునేందుకు నా పూర్తి సహకారం ఉంటుంది. సంస్థ చర్యల వల్ల మానవాళికి, పర్యావరణానికి చాలా మంచి మేలు కలుగుతుంది’’ అని అన్నారు సోనూసూద్.