Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ట్విస్ట్.. ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్న కేంద్ర మంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విశాఖలోని ఉక్కు కార్మాగారం చుట్టూ తిరుగుతున్నాయి. దీనిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గత కొన్నినెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఏపీలోని రాజకీయ పక్షాలు ఈ విషయంలో తమకు న్యాయం చేయడం లేదంటూ.. ఉద్యోగులు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీని మద్ధతు కోరారు. దీనికి కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అంతేకాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే పనులను ఆపాలని కేటీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ అధికారులు.. విశాఖకు చేరుకుని స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో, ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది .
ప్లాంట్‌ను బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి :
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేస్తున్నామని.. ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని ఫగ్గన్ సింగ్ తెలిపారు. ప్లాంట్‌లో ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ పెట్టామని.. దీనిపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొంటున్న విషయంపైనా ఫగ్గన్ సింగ్ స్పందించారు. ఇదంతా ఒక నాటకమని.. బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయమన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈ విషయంలో సీఎంలు కేసీఆర్, జగన్‌లు ఎలాంటి ఎత్తుగడ వేస్తారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments