అసద్‌జీ.. ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ తీసుకోండి:  ఒవైసీని కోరిన అమిత్ షా

  • IndiaGlitz, [Monday,February 07 2022]

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. అసదుద్దీన్‌ యూపీలోని హాపూర్ జిల్లా పర్యటన ముందుగా షెడ్యూల్‌ చేసుకున్నది కాదని ఆయన తెలిపారు. అసద్ పర్యటన గురించి ఆ జిల్లా కంట్రోల్‌రూమ్‌కు ముందుగా సమాచారం ఇవ్వలేదని అమిత్ షా పేర్కొన్నారు. కారుపై కాల్పుల ఘటన తర్వాత అసదుద్దీన్ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని ఆయన తెలిపారు. పోలీసులు వేగంగా స్పందించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి రెండు తుపాకులు, ఆల్టో కారు స్వాధీనం చేసుకున్నారని అమిత్ షా వెల్లడించారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నివేదిక తీసుకుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. గతంలో కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా అసదుద్దీన్‌కు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అమిత్ షా తెలిపారు. కానీ భద్రత తీసుకొనేందుకు ఆయన నిరాకరించారని ఆయన చెప్పారు. కానీ.. కేంద్రం కల్పించిన భద్రతను తీసుకోవాలని అసదుద్దీన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన జడ్‌ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న ఆయన. అందరిలాగే తాను ‘ఏ కేటగిరీ’ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించారు. తన వాహనంపై కాల్పుల ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఒవైసీ.. చావుకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనని అసదుద్దీన్ అన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్‌ ద్వారా సమాధానం ఇస్తారనీ.. ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలో పేదలు, మైనార్టీలకు భద్రత ఉంటే తనకూ ఉన్నట్టేనని చెప్పారు. దేశంలోని పేదలు బాగుంటేనే తానూ బాగుంటానని ఒవైసీ పేర్కొన్నారు. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. న్యాయం చేయాలని అసదుద్దీన్ కోరారు.

More News

‘జనగణమన’ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చేసిన పూరి, తన గొంతుతోనే చెప్పేశాడుగా

‘‘ జనగణమన’’.. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులలో ఒకరితో ఈ సినిమాను పట్టాలెక్కించాలన్నది పూరి   ప్లాన్.

పార్టీ మారతారంటూ వార్తలు.. ప్రాణం వున్నంత వరకు జగన్‌తోనే అన్న రోజా

ఆర్కే రోజా... హీరోయిన్‌గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది.

కొంపముంచిన ప్రమోషన్ వీడియో... చిక్కుల్లో బిగ్‌‌బాస్ ‘‘సరయూ’’

యూట్యూబ్ స్టార్ 7ఆర్ట్స్‌ సరయు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక సెలవ్.. అధికారిక లాంఛనాలతో ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి.

ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ అర్హత మోడీదేనంటూ వ్యాఖ్యలు

హైదరాబాద్ ముచ్చింతల్‌ చినజీయర్ ఆశ్రమంలో సమతామూర్తి రామానుజుల వారి 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు