Union Budget 2023 : వేతన జీవులకు ఊరట, మహిళల కోసం కొత్త స్కీమ్.. కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరట కలిగించడంతో పాటు మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి.
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ :
మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు
కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ.10.22 లక్షల కోట్లు
ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం రూ.9.01 లక్షల కోట్లు
జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం రూ.9.57 లక్షల కోట్లు
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు
50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్దరణ
ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యత
నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రా ఫండ్
ఈ కోర్ట్ ప్రాజెక్ట్ విస్తరణ కోసం మూడో విడత నిమిత్తం రూ.7 వేల కోట్లు
5జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్‌లు
2070 నాటికి కార్బన రహిత భారత్ దిశగా అడుగులు
మిల్లెట్ హబ్‌గా భారత్‌ను రూపొందించే దిశగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు
వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం.. ఇందు కోసం అగ్రి స్టార్టప్‌లకు ప్రత్యేక నిధి
2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం
జమ్మూకాశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు
క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ.2 వేల కోట్లు
ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి
50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్
మత్స్యశాఖకు రూ.6 వేల కోట్లు
18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లు ఏర్పాటు
సహకార సంఘాల వివరాలన్నింటీతో నేషనల్ కో ఆపరేటివ్ డేటాబేస్
ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం
ఉపాధ్యాయులకు శిక్షణ నిమిత్తం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ
740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు.. 38,800 టీచర్ల నియామకం
కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5,300 కోట్లు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు
ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38 వేల కోట్లు
లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు
గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు
మిస్టీ పథకం ద్వారా మడ అడవుల అభివృద్ధి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments