బడ్జెట్ కేటాయింపులు.. షాకులు తప్ప వరాల్లేవ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను నిర్మల ప్రవేశ పెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌ను చదివేశారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు యత్నించాయి. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. కాగా.. ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరల పెరుగుదల నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే ఈ సారి పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే వీటి ప్రస్తావన మాత్రం కాగితాలకే పరిమితం చేసి.. బడ్జెట్లో చదివి వినిపించకపోవడం గమనార్హం. మొబైల్ రేట్లు సైతం మరింత ప్రియం కానున్నాయి. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఈ బడ్జెట్లో సామాన్యుడికి కలిసి వచ్చే అంశం ఏదీ లేకపోవడం గమనార్హం. వరాలు కురిపిస్తారనుకుంటే.. కూరగాయల మొదలు నిత్యావసరాల ధరలన్నింటినీ పెంచేసి షాక్ ఇచ్చారు.
బడ్జెట్ కేటాయింపులు..
ఆత్మనిర్భర్ భారత్‌లో రూ.21.17 లక్షల కోట్లు
ఆరోగ్య రంగంలో రూ.64, 180 కోట్లతో ప్రత్యేక నిధి
రూ.64, 180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం
నివారణ, చిక్సిత, సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం
ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు:
2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు
రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు.
2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
మరో కోటి మందికి ఉజ్వల పథకం :
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా
జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్
డిజిన్వెస్టుమెంట్:
జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు
రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2లక్షల కోట్లు
కొత్తగా 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు
పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్
రక్షిత మంచినీటి పధకాల కోసం రూ.87 వేల కోట్లు
దేశంలో 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు మంచినీరు
స్వచ్ఛ భారత్ మిషన్‌కు లక్షా 41 వేల 678 కోట్లు
రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ అర్బన్
తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగం
15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే పథకం
27 సిటీలకు మెట్రో విస్తరణ
చైన్నై మెట్రో ఫేజ్-2కు రూ.63 వేల కోట్లు
బెంగళూరు మెట్రోకు రూ.14 వేల కోట్లు
కొచ్చీ మెట్రో ఫేజ్-2కు రూ.1,957 కోట్లు
మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులు
1938 బీమా చట్టానికి సవరణ
బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐల పరిమితి 74 శాతానికి పెంపు
ఎఫ్‌డీఐల పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం
గెయిల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ పైప్లైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు
2 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం
జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
పౌష్టికాహారం కోసం..
షౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0
రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాల కోసం ఖర్చుకు నిర్ణయం
ఐదేళ్లలో స్వచ్ఛభారత్ 2.0 కోసం రూ.1,41,678 కోట్లు
మరో కోటి మంది లబ్ధిదారులకు ఎల్పీజీ ఉజ్వల్ యోజన
వచ్చే మూడేళ్లలో 100 జిల్లాలకు గ్యాస్ పైప్లైన్లు
మూలధనం సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20వేల కోట్లు
7 కొత్త పోర్టులు..
2 వేల కోట్లకు మించిన విలువలతో దేశంలో 7 కొత్త పోర్టులు
పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో రెండు కొత్త ఓడరేవుల నిర్మాణం
పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో రెండు కొత్త ఓడరేవుల నిర్మాణం
కొత్తగా ఐదు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 15వేల 700 కోట్లు
కనీస మద్దతు ధర పెంపు...
మద్దతు ధర కింద గోధుమ రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 75 వేల కోట్లు
కనీస మద్దతు ధరకు లక్షా 72 వేల కోట్లు
వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లు
40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి
వెయ్యి మండీలను ఈనామ్‌తో అనుసంధానం
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
ఎన్పీఏలు- మొండిబకాయిలు బ్యాడ్ బ్యాంక్‌లకు తరలింపు
బ్యాంకుల ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు
విద్యారంగం..
దేశవ్యాప్తంగా మరో 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు
లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
32 రాష్ట్రాల్లో వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు అమలు
అన్ని రంగాల్లో కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు
సోలార్ పవర్‌కు రూ. వెయ్యి కోట్లు
డిజిటల్ చెల్లింపుల కోసం..
గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు
సామాజిక భద్రతా పథకాల్లో వీధి వ్యాపారులు
అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు
జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు
యువతకు అవకాశాలు పెంచేలా కొత్త సవరణలు
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం కోసం రూ. 1500 కోట్లు
సీనియర్ సిటిజన్లకు ఊరట..
ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపులు
75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట
పింఛన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు
ప్రధాని ఆవాస్ యోజన మరో ఏడాది పొడిగింపు
గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు
రైల్వేల కోసం..
ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు
2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి
2030 నాటికి రైల్వేలకు కొత్త రూపు
టైర్-2, టైర్-3 సిటీస్‌లో ప్రైవేటుగా ఎయిర్‌పోర్టులు
దేశవ్యాప్తంగా వెయ్యి మార్కెట్లలో ఆన్లైన్ వ్యవస్థ
మొబైల్ రేట్లు మరింత ప్రియం..
ట్యాక్స్ శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పు లేదు
మొబైల్ రేట్లు పెరిగే అవకాశం
నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం
పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు మరిన్ని చర్యలు
ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట
ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం, సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
వ్యక్తిగత ఆదాయపన్నులో ఎలాంటి మార్పు లేదు
స్టార్టప్‌లకు పన్ను రాయితీల పొడిగింపు
విద్యుత్ రంగంలో సంస్కరణలు
విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు
రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి
ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1,624 కోట్లు
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout