కేంద్ర బడ్జెట్-2020 ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్-2020 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికను సభ ముందుంచారు. ఏయే రంగానికి ఎంత కేటాయించారు..? వేటికి ప్రాధాన్యత ఇచ్చారు..? వేటిని ప్రోత్సహించారు..? అనే విషయాలను నిర్మలా స్పష్టంగా చదవి వినిపించారు.

చిత్తశుద్ధితో సేవ చేస్తాం:-

‘మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీ లభించింది. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుంది. సంపదను సృష్టించడమే లక్ష్యం. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయం. నూతన సాంకేతిక పద్దతులు అమలు చేస్తాం. మోదీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగింది. పరిపాలనలో కొత్త ఒరవడి సృష్టించాం. దేశ ఆర్థిక మూలాలు శక్తిమంతంగా ఉన్నాయి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.

జీఎస్టీ ఒక చారిత్రక నిర్ణయం:-

జీఎస్టీ అనేది ఒక చారిత్రక నిర్ణయం. జీఎస్టీతో దేశ ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కు స్వస్తి చెప్పాం. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబ వ్యయం 4 శాతం తగ్గింది. కొత్తగా 60లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు. పేదలు, బడుగు వర్గాలకు చేరాల్సిన పథకాల వేగం పుంజుకున్నాయి. సామాన్యుల సంక్షేమానికి ఏడు సూత్రాల పథకం అమలు చేశాం.
ఎఫ్‌డీఐలు 284 బిలియన్ డాలర్లకు చేరాయి’ అని నిర్మల తెలిపారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..:-

మూడు ప్రాథమ్యాలతో బడ్జెట్ రూపకల్పన
ఆంకాక్షలతో కూడిన భారతావని..ఆర్థికాభివృద్ధి..
ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగించే సమాజం
ప్రపంచంలో భారత్‌ ఐదో ఆర్థిక శక్తి
నగదు బదిలీతో నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు
ఆయుష్మాన్‌ భవ సత్ఫలితాలిస్తోంది
సబ్‌కా సాత్‌..సబ్‌కా వికాస్‌..సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి
6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే లక్ష్యం
వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలి
వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల కార్యాచరణ
కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు

అత్యంత ప్రాధాన్యత:-

అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత
నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు
సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం
కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
వ్యవసాయ వినియోగంపై తమిళ కవయిత్రి అవ్వయార్‌ సూక్తిని గుర్తు చేసిన నిర్మల

గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం:-

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు
సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం
స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం
ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం

మరింత విస్తరిస్తాం:-

పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు
కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు
ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి
2020-21లో అగ్రికల్చర్‌ రీఫైనాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
ఇప్పటికి 58లక్షల స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి
స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం
వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
వ్యవసాయానికి మాత్రం 1.60 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
మత్స్యకారులకు సాగర్‌మిత్ర పథకం

మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి..:-

పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు
ఆయుష్మాన్ భారత్ కింద 112 జిల్లాల్లోని ద్వితీయశ్రేణి పట్టణాలకు ప్రాధాన్యం
2025 నాటికి టీబీని రూపుమాపడమే సర్కార్ ధ్యేయం
బహిరంగ మల విసర్జన రహిత భారత్‌ సాధన కోసం ఓడీఎస్‌ ప్లస్ పథకం
స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు

కొత్త విద్యా విధానం:-

2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు
త్వరలో కొత్త విద్యా విధానం
మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్
వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు
పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య
త్వరలో నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు
వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం
జల్‌జీవన్‌ మిషన్‌కు 11,500 కోట్లు
ప్రధాని జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400 కోట్లు

కొత్తగా ఐదు స్మార్ట్ సిటీలు:-

ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్న కేంద్రం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్ సిటీలు
రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్
ఎలక్ట్రానిక్ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు
ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్విక్ స్కీమ్
ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేస్తాం
మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు
పారిశ్రామిక, వాణిజ్యరంగాల కోసం రూ.27,300 కోట్లు
పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లు
త్వరలో జాతీయ లాజిస్టిక్ పాలసీ
అన్ని రకాల ముడిసరుకులు ఒకే చోట దొరికేలా ప్రత్యేక విధానం

విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది:-

అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది
ప్రతి ఇంటికి విద్యుత్ అందించడం మా ప్రభుత్వం సాధించిన ఘనత
రాబోయే మూడేళ్లలో ప్రీపెయిడ్‌ కరెంట్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం
స్మార్ట్ మీటర్లతో కరెంటు ఎవరి దగ్గరి నుంచి కొనాలో నిర్ణయించుకునే వెసులుబాటు
జాతీయ గ్యాస్ గ్రిడ్‌ను 16 వేల కి.మీ. స్థాయి నుంచి 27 వేల కి.మీ స్థాయికి విస్తరిస్తాం

ప్రతి ఇంటికి ఇంటర్నెట్:-

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆర్థికరంగ స్వరూపాన్నే మార్చేస్తున్నాయి
కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు
పోటీని తట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు..
డేటా సెంటర్లు ఉపయోగపడతాయి
భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ ఇస్తాం
లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్
మూలకణ వైద్యవిధానం అభివృద్ధి కోసం డేటా బేస్‌ని ఏర్పాటు చేస్తాం
క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు

బేటీ పడావో పథకం సక్సెస్‌:-

ప్రాథమిక స్థాయిలో బాలుర కంటే బాలికల శాతం ఎక్కువగా ఉంది
89 శాతం మంది మగపిల్లలు పాఠశాలలకు వెళ్తుంటే 93 శాతం మంది బాలికలు వెళ్తున్నారు
బేటీ పడావో కార్యక్రమం ఎంతటి స్థాయిలో విజయవంతం అయిందో చెప్పడానికి ఇదొకటి చాలు

అద్భుతంగా విజయవంతం:-

పోషణ్‌ అభియాన్‌, అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్లు లాంటి విధానాలు అద్భుతంగా విజయవంతం
10 కోట్ల గృహాలు పోషకాహార లోపాన్ని అధిగమించాయి
బాలికల ఆరోగ్యం, సాధికారత, గర్భందాల్చే సమయం లాంటి కీలక విషయాలపై సూచనలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌, 6 నెలల్లో నివేదిక
బాలిక, మహిళల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు
షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ. 85 వేల కోట్లు
షెడ్యూల్‌ తెగల కోసం రూ.53, 700 కోట్లు
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 9 వేల కోట్లు

చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు
రాఖీగడి, హస్తినాపూర్‌, శివసాగర్‌, డోలాబీరా, ఆదిత్యనల్లూర్‌ లాంటి..
చారిత్రక ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు
విశేష పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి
రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు
సింధు సరస్వతి నాగరికతే భారతీయతకు మూలం అని నమ్ముతున్నాం
లోధాల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం..

More News

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను - అల్లు అర్జున్

రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు.

నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్..

అవును మీరు వింటున్నది నిజమే.. ఇవాళ్టి నుంచి కొన్ని కొన్ని ఫోన్లలో వాట్సాప్ బంద్ కానుంది.

సూపర్‌స్టార్‌తో ఛాన్స్ కొట్టిన నయన్‌

నయనతార నక్కతోకను తొక్కినట్టే ఉంది. సీనియర్‌ హీరోయిన్లందరూ నిదానంగా ఇంటిదారి పడుతుంటే, నయనతార ముందు మాత్రం డైరక్టర్లు క్యూ కడుతున్నారు.

వర్మ దానికి ఒప్పకుంటారా?

రామ్‌గోపాల్‌ వర్మ... తెలుగులో సంచనాలకు మారుపేరు. అక్కడిదాకా అంతా బావుంది. ఆ మాటను ఆయన ఎంజాయ్‌ కూడా చేస్తారు.

నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ అంతే.. తప్పేముంది!?

జనసేనకు గుండెకాయ లాంటి నేతగా పేరుగాంచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.