మీ ఫోన్‌లో ట్రూ కాలర్ ఉందా.. అర్జంట్‌గా తీసేయండి!

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

డిజిటల్.. డిజిటల్.. ఇప్పుడంతా డిజిటల్‌మయం.. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఈ టెక్నాలజీ అవసరాలకు వాడుకునే వారు కొందరే ఉంటే.. అనవసరమైన పనులకు వాడుకునే వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిల్చుని ఏ రెండు గంటలకో.. మూడు గంటలకో పనయ్యేది. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఆ బాధలు పూర్తిగా తప్పాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. అకౌంట్‌లో పైసలు ఉంటే చాలు ఇక కొన్ని సెకన్లలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నాయ్. అయితే.. దీన్నే అదనుగా చేసుకుని పేరుగాంచిన పేమెంట్ యాప్స్.. గూగుల్ పే, ఫోన్ పే.. పేటీఎం, భీమ్‌తో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అయితే కొన్ని కొత్త యాప్స్ ‌వల్ల యూజర్స్ తల బాదుకునే పరిస్థితి వచ్చింది.

అసలేం జరిగింది..!

తాజాగా.. ట్రూకాలర్ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయని.. ఈ యాప్‌లో ఓ బగ్ చొరబడటం తద్వారా ఆటోమేటిక్‌గా యూపీఐ(UPI) అకౌంట్లతో లింక్ అయిపోతోంది. ఇది పెద్ద స్కామ్ ‌అని కొందరు నెటిజన్లు గుర్తించారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే అనుమానాలే నిజమయ్యాయి. మరీ ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంకు యూజర్లు వాడే ట్రూకాలర్ అకౌంట్లలో ఆటోమాటిక్‌గా UPI అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. దీంతో యూజర్లు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా ట్రూకాలర్‌లో తలెత్తిన బగ్ కారణంగానే అని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి.

అర్జంట్‌గా ఈ పని చేయండి..!

కాగా ఈ బగ్‌తో యూజర్లంతా తమ స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ ట్రూకాలర్‌ను అప్‌డేట్ చేసుకోవద్దని పలువురు నిపుణులు, టెక్నాలజీ తెలిసినవాళ్లు చెబుతున్నారు. కాగా.. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్రూ కాలర్ యాప్ రాత్రికిరాత్రే ఆటేమెటిక్‌గా లేటెస్ట్ వెర్షన్ 10.41.6కు మారినట్టు గుర్తించినట్లు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. సో.. దీన్ని బట్టి చూస్తే మీరు అప్డేట్ చేసుకోకపోవడమే కాదు.. ఉన్న యాప్‌ను తొలగించినా మంచిదేనన్న మాట.

ఇదిలా ఉంటే.. 2017 నుంచి UPI బేసిడ్ మొబైల్ పేమెంట్ సర్వీసు అందించేందుకు ICICI బ్యాంకుతో ట్రూకాలర్ భాగస్వామ్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇలా ట్రూకాలర్ UPI అకౌంట్లతో లింక్ కావడంతో పర్సనల్ డేటా, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ అవుతోందని యూజర్లు భయపడుతున్నారు.

స్పందించిన ట్రూకాలర్ :

ఈ మొత్తం వ్యవహారం ట్విట్టర్ వేదికగా ట్రూకాలర్ స్పందించింది. ‘ట్రూకాలర్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో లోపం ఉన్నట్టు గుర్తించాం. ఇది పేమెంట్ ఫీచర్‌పై ప్రభావం చూపుతోంది. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే ఆటోమాటిక్‌గా UPI రిజిస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్‌కు మారిపోతుంది. ఈ లేటెస్ట్ వెర్షన్ అప్‌డేట్‌ను నిలిపివేస్తున్నాం. ఇకపై యూజర్లకు ఎలాంటి సమస్య ఉండదు. ఈ విషయంలో యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అని ట్రూకాలర్ వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు.. ఈ బగ్ సమస్యను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. సో ఈ మొత్తమ్మీద చెప్పదలుచుకున్నది ఏమిటంటే ట్రూ కాలర్‌‌ యాప్‌ను ఫోన్ నుంచి తీసేయడం మంచిది.

More News

బోయ‌పాటికి హీరో దొరికాడా?

మాస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న బోయ‌పాటిశ్రీను ప‌రిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందిగానే త‌యారైంది.

'సాహో' కోసం ఇండియా వైడ్ ప్ర‌మోష‌న్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోలు వారి సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ప‌రిమితంగానే ఉంటారు. ముఖ్యంగా ప్ర‌భాస్ వంటి సిగ్గ‌రి అయితే మ‌రి ఎక్కువ లిమిటేష‌న్స్ పెట్టుకుని ఉంటాడు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందింది. 16వ లోక్‌సభ కాలంలోనే ట్రిపుల్ తలాక్ బిల్లుకి లోక్‌సభలో ఆమోదం

వామ్మో.. హేమను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు.. కిడ్నాప్!!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్-3 షో సీజన్ మొదలవుతుందని అనే టాక్ వచ్చినప్పట్నుంచి.. నేటికీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.

సీఎం వైఎస్‌ జగన్‌కు జనసేనాని బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు భాగంగా పలు విషయాలను ప్రస్తావించడం జరిగింది.