ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక లైలా కోసం సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫ్ నామినేట్ అవడం కరెక్ట్ కాదని నాగ్ మరోసారి కరాటే కల్యాణికి సూచించారు. కరాటే కల్యాణి కంటెస్టెంట్‌లందరి గురించి చెప్పిన అనంతరం నాగ్ బిగ్ బాంబ్‌ను ఇచ్చారు. దాని ప్రకారం కల్యాణి సూచించిన కటెంస్టెంట్ ఈ వారం నామినేట్ అవుతారని చెప్పారు. కాగా.. కల్యాణి ఆ బిగ్‌బాంబ్‌ను దేవి నాగవల్లిపై వేశారు. దీంతో దేవి నాగవల్లి నామినేట్ అయ్యారు. కల్యాణి వెళ్లిన అనంతరం నాగ్ ఓ గేమ్ ద్వారా అభిజిత్, కుమార్ సాయిలను సేవ్ చేశారు. నెక్ట్స్ అందరితో గేమ్ ఆడించారు. మొదట అఖిల్, అభిజిత్‌తో గేమ్ ఆడించగా.. దానిలో అఖిల్ గెలిచాడు. నెక్ట్స్ మొనాల్, హారికతో ఆడించగా.. మొనాల్ గెలిచింది.
నెక్ట్స్ అమ్మ రాజశేఖర్‌ను నాగ్ సేవ్ చేశారు. గేమ్ మొత్తం మీద గంగవ్వ రాక్ చేసేశారు. ఆమె వయసుకు అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాకుండా.. గేమ్‌ను సైతం గెలిచారు. గేమ్ అయిపోయిన అనంతరం నాగ్.. సొహైల్‌ని సేవ్ చేశారు. నెక్ట్స్ నోయెల్‌ను కూడా సేవ్ చేశారు. ఇక మిగిలింది మొనాల్, హారిక. వారిద్దరినీ సేవ్ చేసేది నామినేషన్స్‌లో లేని ఏడుగురని నాగ్ పేర్కొన్నారు. ఎవరిని బయటకు పంపించాలనుకుంటున్నారో వారి పాట్‌లో రంగు నీళ్లు పోయాలి. అఖిల్, మెహబూబ్, లాస్యలు దేవి పాట్‌లో రంగు నీళ్లు పోయగా.. దేవి, అరియానా, దివి.. మొనాల్ పాట్‌లో రంగు నీళ్లు పోశారు. ఫైనల్‌గా వచ్చిన సుజాత.. హారిక పాట్‌లో రంగునీళ్లు పోయడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.
హారిక ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ ప్రకటించారు. దీంతో కంటెస్టెంట్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి చాలా బాధగా హౌస్‌మేట్స్ అంతా సెండాఫ్ ఇచ్చేందుకు గేటు వరకూ వెళ్లారు. అయితే అందరి ఊహాలకు భిన్నంగా హారిక.. గేటు దగ్గరకు వెళ్లగానే నాగ్ వెనక్కి పిలిచారు. ఈ ట్విస్ట్‌ను నిజానికి ఎవరూ ఊహించలేదు. ఉదయం నుంచి హారిక ఎలిమినేట్ అయ్యిందని.. సీక్రెట్ రూమ్‌లో ఉంచబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్‌ని మాత్రం బిగ్‌బాస్ ఇచ్చారు. అయితే నామినేషన్స్‌ను సిల్లీగా తీసుకున్నందుకు తానిలా చేయాల్సి వచ్చిందని నాగ్ తెలిపారు. మొత్తానికి ఇవాళ షో మొత్తం అదిరిపోయే ఫన్.. ట్విస్ట్‌తో నడిచింది. ఎప్పటిలాగే నాగ్ రాక్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com