మార్చి 29 'ఉంగరాల రాంబాబు' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Sunday,March 26 2017]

'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్ హీరోగా, ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. .ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.
యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం టీజ‌ర్ ని ఉగాదిశుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయ‌నున్నారు. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే ఆడియోని విడుద‌ల చేసి, స‌మ్మ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కిస్తున్న ఉంగ‌రాల రాంబాబు చిత్రం యెక్క టీజ‌ర్ ని ఉగాది ప‌ర్వ‌దినాన విడుద‌ల చేయ‌నున్నాము. చాలా గ్యాప్ త‌రువాత సునిల్ త‌ర‌హా కామెడి చూస్తారు. . మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్విస్తాము. ప్ర‌కాష్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్ లు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. అతిత్వ‌ర‌లో ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు.

More News

బై లింగువల్ లో అమలాపాల్...

తెలుగు,తమిళంలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరుచుకున్న హీరోయిన్ అమలాపాల్.

వరుణ్ తేజ్ బాహుబలి భామ

వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందతోన్న చిత్రం 'మిస్టర్'.

జగన్నాథమ్ వెనక్కి వెళుతున్నాడా..?

ఆర్య,పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్,దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం డిజె 'దువ్వాడ జగన్నాథమ్'.

యంగ్ టైగర్ లుక్ అదిరిందిగా..

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం జైలవ కుశ(వినపడుతున్నపేరు).

సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లంక'

రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న