ప్రోడ్యూసర్ దిల్ రాజు వాయిస్ ఓవర్ తో సెప్టెంబర్ 15న 'ఉంగరాల రాంబాబు' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్ హీరోగా, మియాజార్జ్ జంటగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెరకెక్కంచిన ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ నటించిన గత చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుంది. సునిల్ తరహ కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి.
మెస్ట్ క్రేజియస్ట్ ప్రోడ్యూసర్ దిల్ రాజు వాయిస్ ఓవర్ ఇవ్వటం ఉంగరాల రాంబాబు కి ప్రధానమైన హైలెట్
2017 సంవత్సరం మెదలు కొని దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి, నెను లోకల్, డి.జె, ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించి సక్సస్‌ని కేరాఫ్ గా మార్చుకున్నారు. ఓ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ప్రోడ్యూస్ చేయాలన్నా ఆ చిత్రం లో ఎంతో విషయం వుంటే కాని దిల్ రాజు ఇన్ వాల్వ్ అవ్వరు. ఇదిలా వుంటే అసలు వాయిస్ ఓవర్ అంటే ఏ హీరోతోనో లేదా ఏ ఫ్యామస్ ఆర్టిస్ట్ తోనే చెప్పించుకుంటారు. కాని మెట్టమెదటి సారిగా నిర్మాత దిల్ రాజు గారితో చెప్పించుకొవటం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ -- ముందుగా మా చిత్రానికి అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధన్యవాదాలు. దిల్ రాజు గారితోనే చెప్పించడానికి ఓ ప్రత్యేఖమైన కారణం వుంది. అది సెప్టెంబర్ 15న చిత్రం చూడాల్సిందే. అలాగే దర్శకులు క్రాంతి మాధవ్ అనుకున్న కథని చాలా బాగా తెరకెక్కించారు. కామెడి అంటే ఏదో సెపరేట్ గా వచ్చే ట్రాక్ లు కాకుండా కథలో ఇమిడే అంతగా రాసుకున్నారు. అంతకు మించి బాగా తీసారు. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో వచ్చే డైలాగ్ ఈ దేశాన్ని ఆలోచింపజేసే విధంగా వుంటుంది. చిత్రం మెదటి భాగం కామెడిగా సాగుతూ రెండవ భాగంలో కామెడి రెండింతలు పెరగటమే కాకుండా ప్రతి డైలాగ్ ప్రతిఓక్కిరిని ఆలోచింపజేసే విధంగా వుంటుంది.
చాలా సంవత్సరాల తరువాత సునిల్ పాత్ర నవ్విస్తూ ఆలోచింపజేసే విధంగా వుంటుంది. విడుదల చేసిన అన్ని పాటలు చాలా ప్రేక్షకాదరణ పోందటం చాలా ఆనందంగా వుంది. హీరోయిన్ గా మియాజార్జి పాత్రకి విలువ వుంటుంది. గ్లామర్ తో పాటు ఫెర్‌ఫార్మెన్స్ ని చించేసిందనే చెప్పాలి. అలాగే దుబాయ్ లో చేసిన సాంగ్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. వినోదాన్ని , విజ్ఙానాన్ని కలిపి తెరకెక్కించిన చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అలాంటి చాలా మంచి పాత్రల్లో నటించిన ప్రకాష్‌రాజ్ , పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర లు నటన ఈ చిత్రానికి ప్రత్యఖంగా నిలుస్తుంది. ఈచిత్రాన్ని అన్ని కార్కక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుందని నమ్ముతున్నాం. అని అన్నారు.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments