క్వాలిటీ కోసమే 'ఉంగరాల రాంబాబు' లేట్!
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్, మియాజార్జ్ జంటగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలవుతోంది.
ఈ సినిమా ఇంతకు ముందే విడుదల కావాల్సింది కానీ సినిమాను ప్రేక్షకుల ముందు క్వాలిటీగా ఆవిష్కరించడానికే లేట్ అయిందట. ఈ విషయాన్ని చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో హీరో సునీల్ స్వయంగా తెలిపారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగింది.
పోసాని కృష్ణమురళీ, అలీ, శ్రీనివాసరెడ్డి, అదుర్స్ రఘు, సత్య, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, సప్తగిరి, రఘుబాబు, తాగుబోతు రమేశ్‌తో పాటు దాదాపు 15 మంది కమెడియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సునీల్ కృషిని అభినందించారు. కామెడీ చేయగలిగిన వాడు ట్రాజెడీని, మరే ఎమోషన్ని అయినా పండించగలడని అలీ అన్నారు. ఎవరికైనా జయాపజయాలు ఉంటాయని, ఈ సినిమా సునీల్‌కి మంచి బ్రేక్ అవుతుందని పోసాని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com