'ఉంగరాల రాంబాబు' సాంగ్ దాసరికి అంకితం - హీరో సునీల్
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి నిర్మాతగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నటిస్తున్న చిత్రం `ఉంగరాల రాంబాబు` ఈ సినిమా మొదటి సాంగ్ హులాలాలా హులాలాలా...సాంగ్‌ను పాత్రికేయులందరూ కలిసి విడుదల చేశారు.
దాసరిగారితో మంచి అనుబంధం ఉండేది. ఆయన నన్నెప్పుడూ అందాలరాముడు అని పిలిచేవారు. ఎప్పుడైన మానసిక ధైర్యం తక్కువగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకెళ్ళి ఓ పది నిమిషాల పాటు కూర్చొంటే సరిపొయేది. ఆయన ఈరోజు కూడా మా వేడుకకు హాజరైనట్లుగానే భావిస్తున్నాను. ఓ కమెడియన్‌గా, హీరోగా మారిన తర్వాత నా చిత్రాల్లో నా కామెడితో ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చాను. అయితే ఉంగరాల రాంబాబు సినిమా చేయడం, ఓ అర్థవంతమైన సినిమా చేసినట్లుగా భావిస్తున్నాను. సినిమా రెండు గంటల పదిహేను నిమిషాలు ప్రేక్షకులు చాలా అర్థవంతంగా నవ్వుకుంటారు. ఇలాంటి సినిమా చేయడానికి కారణం నిర్మాతలు పరుచూరి కిరిటీ, పరుచూరి ప్రసాద్, దర్శకుడు క్రాంతి మాధవ్గారే కారణం. అందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్.
ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారితో పనిచేసే అవకాశం కలిగింది. నాకు, ప్రకాష్‌రాజ్‌గారికి మధ్య టగ్ ఆఫ్ వార్లాంటి సన్నివేశాలుంటాయి. ప్రకాష్‌రాజ్‌గారి క్యారెక్టరైజేషన్ గొప్పగా ఉంటుంది. ప్రతి మూడురోజులకొకసారి సినిమాల్లోని మిగిలిన పాటలను విడుదల చేస్తాం. ఈ సాంగ్‌ను దాసరిగారికి అంకితమిస్తున్నాం అని హీరో సునీల్ తెలిపారు. ఈ సినిమాలో సునీల్ గారు అద్భుతమైన డ్యాన్స్ చేశారు. గిబ్రాన్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత పరుచూరి కిరిటీ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com