మిస్ అయినా.. పవన్ తో కనెక్ట్ అయ్యాడు
Send us your feedback to audioarticles@vaarta.com
'మర్యాద రామన్న' సినిమా హాస్య నటుడు సునీల్ జాతకాన్నే మార్చేసింది. అంతేకాకుండా.. ఆ చిత్రం తెచ్చిన సక్సెస్..అతని ఆలోచనా విధానాన్నే మార్చేసింది. పూర్తిస్థాయి కథానాయకుడుగా కొనసాగాలని తను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు సునీల్. 'మర్యాద రామన్న' తరువాత సునీల్ కి ఊరటనిచ్చింది 'పూలరంగడు', 'జక్కన్న' చిత్రాలు మాత్రమే.
తాజా చిత్రం 'ఉంగరాల రాంబాబు' అయితే విడుదలకి ఇబ్బందులు పడుతోంది. ఎప్పుడో పూర్తయినా.. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమౌతోంది. అన్నీ బాగుంటే.. హీరోగా సునీల్ నటించిన తొలి చిత్రం 'అందాల రాముడు' విడుదల తేది అయిన ఆగస్టు 18న ఈ 'ఉంగరాల రాంబాబు' కూడా వచ్చేవాడు. అయితే.. అది వర్కవుట్ అవలేదు. అయితేనేం.. ఈ తేదిని మిస్ అయినా.. మరో కొత్త తేదిని సునీల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సారి అది పవన్ కళ్యాణ్‌తో కనెక్ట్ అయి ఉండడం విశేషం.
అదెలాగంటే.. పవన్ బర్త్‌డే అయిన సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తేదికి ఒక రోజు ముందు బాలకృష్ణ 'పైసా వసూల్' రిలీజ్ ఉంది. అయినా ధైర్యం చేస్తున్నాడు సునీల్. మరి ఈ సారైనా అనుకున్న తేదికి వస్తాడో మళ్లీ వాయిదా పడతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments