పిటిషన్ మొత్తం తప్పుల తడక.. వైసీపీకి సుప్రీంలో ఊహించని షాక్

  • IndiaGlitz, [Friday,January 22 2021]

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సైతం వెనక్కి ఇచ్చేయడం గమనార్హం. దీంతో ఇప్పటికిప్పుడు పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేసే అవకాశం ఉండదని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీంతో సోమవారం వరకూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఇక అవకాశం లేనట్టేనట..

కాగా.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం వెలువడనుంది. దీంతో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం వైసీపీకి లేనట్లేనని తెలుస్తోంది. కాగా.. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది.

హైకోర్టు కీలక తీర్పు...

కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.
దీంతో వైసీపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

More News

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిన్నట్టుంది: పవన్

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిందన్నట్టు వైసీపీ వైఖరి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

అఖిల ప్రియను ఒంటరిని చేసిన టీడీపీ.. అసలు పట్టించుకోరేం..

హైదరాబాద్‌లో ప్రవీణ్ రావు అన్నదమ్ముల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా శశికళ ఆరోగ్యం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్

ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని....