‘వైల్డ్ డాగ్’ యూనిట్‌కు ఊహించని షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, అప్పాజీ అంబరీష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. రొటీన్ కమర్షియల్ మూవీలా కాకుండా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. 2007లో జరిగిన గోకుల్ చాట్ ఘటన సహా పలు ప్రాంతాల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌ల నేపథ్యంలో తెరకెక్కింది.
భారతదేశంలో జరిగిన అతి పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలా డీల్ చేసిందనేదే ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో నాగార్జున.. ఏసీపీ విజయ్ వర్మగా నటించి మెప్పించారు. గత రెండేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న నాగ్.. ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని కసిగా ఈ సినిమా చేశారు. నాగ్ కోరికలో బలమున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం బాగానే ఉంది. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలాంటి సమయంలో ‘వైల్డ్ డాగ్’ టీమ్‌కి భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం ‘వైల్డ్ డాగ్’ని కూడా పట్టుకుంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే.. పైరసీ వీడియో బయటకు వచ్చేసింది.
పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు ‘వైల్డ్ డాగ్’ పుల్ మూవీ డౌన్ లోడ్ లింక్‌ను శుక్రవారమే పెట్టేశాయి. ఈ పైరసీ మూవీ కారణంగా ‘వైల్డ్ డాగ్’ కలెక్షన్లపై ప్రభావం ఎంతో కొంత పడే అవకాశం లేకపోలేదు. నిజానికి ‘వైల్డ్ డాగ్’ మూవీ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే గురువారమే లీకైపోయిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ ట్వీట్ చేసింది. అయితే ఆ తరువాత తూచ్ అనేసింది. అదంతా అబద్దమని, జనాల్ని ఫూల్స్ చేయడానికే అలా చేశామని మ్యాట్నీ మూవీస్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీ ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే నిజంగానే తమ మూవీ లీకైపోవడంతో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. పైరసీ ఎఫెక్ట్ ఈ మూవీపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments