జూనియర్ ఎన్టీఆర్ మామకు ఊహించని షాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి వారబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మామ (ప్రణతి తండ్రి) నార్నె శ్రీనివాసరావుకు ఐటీ అధికారులు ఊహించని షాకిచ్చారు. నార్నె.. స్టూడియో ఎన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్టూడియోలో గురువారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారు..? ఏమేం దొరికాయి..? అసలెందుకు ఐటీ అధికారులు సోదాలు చేశారు..? ఐటీ సోదాలు చేయాలని ఎవరైనా ఫిర్యాదులు చేశారా..? అనే విషయాలు తెలియరాలేదు. అంతేకాదు.. ఐటీ సోదాల గురించి ఇప్పటి వరకూ అధికారులు ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఐటీ అధికారులిచ్చిన ఊహించని షాక్‌తో ఎన్టీఆర్, ప్రణతిరెడ్డి, నార్నె కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కాగా.. ఎన్నికలకు ముందు ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో నార్నె వైసీపీ కండువా కప్పుకున్నా సంగతి తెలిసిందే. అయితే.. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే నార్నెపై కూడా దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments