క‌డ‌ప గ‌డ‌ప‌లో జనసేనానికి ఊహించని స్వాగతం!

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

జ‌న‌సేన పోరాట యాత్ర‌లో భాగంగా క‌ర్నూలు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని క‌డ‌ప జిల్లాలో అడుగుపెట్టిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. అహోబిలం నుంచి బ‌య‌లుదేరి క‌డ‌ప జిల్లాకి చేరుకున్న ఆయనకు మైదుకూరు వ‌ద్ద వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. జ‌య‌జ‌య‌ధ్వానాలు చేస్తూ క‌డ‌ప జిల్లాలోకి అపూర్వ ఆహ్వానం ప‌లికారు. వాహ‌న‌శ్రేణి పైకి వ‌చ్చి అభిమానుల‌కి అభివాదం చేస్తూ ఆయ‌న ముందుకి సాగారు.

ఇసుక‌ వేస్తే రాల‌నంత‌గా మైదుకూరు ర‌హ‌దారుల‌పై కిక్కిరిసిన జ‌న‌సందోహాన్ని దాటుకుని కాన్వాయ్ ముందుకి రావ‌డానికి అర్ధ‌గంట‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. దారి పొడుగునా ప్ర‌తి గ్రామం నుంచి ప్ర‌జ‌లు జాతీయ ర‌హ‌దారిపైకి వ‌చ్చి జ‌న‌సేన జెండాలు రెప‌రెప‌లాడాయి. ఖాజీపేట‌, చెన్నూరుల్లో సైతం వేలాది మంది ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కి వ‌చ్చి జ‌న‌సేనానికి పూల వ‌ర్షంతో స్వాగ‌తం ప‌లికారు. దేవుని క‌డ‌ప‌ ఆర్చ్ నుంచి క‌డ‌ప న‌గ‌రంలోకి ప్ర‌వేశించిన ప‌వ‌న్‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం వ‌ద్ద భారీ జ‌న‌స‌మూహం పూలాభిషేకంతో స్వాగ‌తం ప‌లికింది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తుగా వామ‌ప‌క్ష నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైతం పెద్ద‌ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఈ రేంజ్‌‌లో ఘనస్వాగతం లభిస్తుందని పవన్‌‌ కూడా బహుశా ఊహించి ఉండరేమో.!

More News

కడప గడ్డపై జగన్‌ గురించి పవన్ ఏమన్నారంటే...

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ తెలుగుదేశం పార్టీతోగానీ, వైసీపీతోగానీ జ‌త‌క‌ట్ట‌ద‌ని, వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్

పాక్‌కు చిక్కిన భారత్ పైలట్‌పై సూర్య బ్రదర్స్ ట్వీట్

భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం చేసి పాకిస్థాన్‌ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే.

సైరా..ఇక నాలుగు రోజులే!

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

'డియర్ కామ్రేడ్' సంద‌డి అప్పుడే

`పెళ్ళిచూపులు`తో స‌క్సెస్‌కొట్టి `అర్జున్‌రెడ్డి`తో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కుర్ర హీరో విజ‌య్ దేవ‌రకొండ‌ను `గీత గోవిందం` స్టార్ హీరోగా మార్చేసింది.

గుడ్‌న్యూస్: విశాఖకు రైల్వేజోన్ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌‌ అధికారికంగా ఓ ప్రకటన