మారుతి చేతుల మీదుగా 'ఉందా లేదా' చిత్రం ఆడియో రిలీజ్

  • IndiaGlitz, [Sunday,February 12 2017]

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఉందా..లేదా?'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది..సంగీత దర్శకుడు శ్రీ మురళి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియోలోని రెండు సాంగ్స్ ను ప్రముఖ దర్శకులు మారతి విడుదల చేశారు..
ఈ సందర్భంగా
దర్శకులు మారుతి మాట్లాడుతూ : ఉందా. లేదా..?టైటిల్ క్యాచిగా ఉంది..అంతేకాకుండా ఈ చిత్రంలోని ఉందా లేదా టైటిల్ సాంగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది..శ్రీ మురళి అందించిన సంగీతం అందరికి నచ్చుతుందని అన్నారు ..మూవీ టీజర్ చూసాను ..చాలా ఆసక్తి ఉంది..ఈ చిత్రం ఖచ్చితం ఈ టీమ్ కు సక్సెస్ ను అందిస్తుందని అన్నారు ..
చిత్ర దర్శకుడు అమనిగంటి వెంకట శివప్రసాద్‌ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ జోన‌ల్‌లో రూపొందుతున్న మా చిత్రం సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుందన్నారు...మా ఆడియోలోని రెండు సాంగ్స్ ను ప్రముఖ దర్శకులు మారతి గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు..నిర్మాత అయితం ఎస్.కమల్ గారు కాంప్రమైజ్ కాకుండా తీసారు..ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది...ఈ చిత్రం ఆడియో అందరికి నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు..
చిత్ర నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ... మా చిత్ర ఆడియో ప్రముఖ దర్శకులు మారుతి గారు చేతులు మీదుగా జరగడం ఆనందంగా ఉంది..ఈ యూనిట్ ను అభినందిండం మాకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది.. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందిలేకుండా షూటింగ్ పూర్తిచేసుకున్నామని అన్నారు. సీనియర్ ఆర్టిస్ట్‌‌లు జీవా, రామ్ జగన్, ఝూన్సీ, సాయి బాగా సపోర్ట్ చేశారన్నారు. టెక్నీషిన్స్ సపోర్టుతో ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా పూర్తిచేశామని తెలిపారు.
హీరో రామకృష్ణ మాట్లాడుతూ : మారుతి గారు చేతుల మీదుగా నా మొదటి సినిమా ఆడియో రిలీజ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు..ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరు అభినందించారన్నారు..ఈ చిత్రం అందరికి నచ్చుతుందని..మాకు మంచి సక్సెస్ దొరుకుందని అన్నారు..
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ .. మా చిత్రం ఆడియో రిలీజ్ చేసిన మారుతి గారికి థ్యాంక్స్ అన్నారు..ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు తెలిపారు..
సంగీత దర్శకుడు శ్రీమురళి మాట్లాడుతూ .. నేను సంగీతం అందించిన ఉందా లేదా చిత్రం మారుతి గారు చేతులుగా మీదుగా రిలీజ్ అవ్వడమే బిగ్ ఏచీవ్ మెంట్ గా ఉందన్నారు..నా సంగీతం మారుతి గారికి నచ్చడం చాలా సంతోషంగా ఉందన్నారు..ఈ ఆడియో అందరికి నచ్చుతుందని తెలిపారు..
కమెడీయన్ సాయి మాట్లాడుతూ : ఉందా లేదా చిత్రంలో దర్శకనిర్మాతలు మంచి పాత్ర ఉచ్చారు.. మారుతిగారు చిత్రాల్లో ఎంతో పేరు వచ్చిందో ఈచిత్రంలో కూడా అంతే పేరు వస్తుందని అన్నారు..మేము అడగగానే ఆడియో రిలీజ్ చేసిన మారుతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.
ఈ చిత్రానికి పిఆర్ఓ:అశోక్ దయ్యాల, కెమెరా: ప్రవీణ్ కె బంగారి, పాటలు నాగరాజు, మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ -సాగర్, నిర్మాత: అయితం ఎస్.కమల్, కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్.