సుశాంత్ మృతితో అండర్ వరల్డ్‌కు సంబంధాలున్నాయి: మాజీ ‘రా’ అధికారి
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మరణంతో అండర్ వరల్డ్‌కు సంబంధాలు ఉండవచ్చని మాజీ రా అధికారి ఎన్కే సూద్ అనుమానం వ్యక్తం చేశారు. అండర్ వరల్డ్‌కి చెందిన నేరస్థులు ఎలాంటి అనుమానమూ తలెత్తకుండా సుశాంత్‌ను మర్డర్ చేశారని.. ప్రతి ఒక్కరి దృష్టిని మళ్లించడంలో వారు సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు. చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్న భరోసా ఇచ్చి సుశాంత్‌ని హత్య చేసేందుకు వ్యక్తుల్ని మాట్లాడి ఉంటారని ఎన్కే సూద్ అనుమానం వ్యక్తం చేశారు.
“సుశాంత్ మరణ కేసుకు అండర్ వరల్డ్‌తో సంబంధం ఉంది. అండర్ వరల్డ్‌కు చెందిన నేరస్థులు తమ పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. హత్య కేసు నుంచి దృష్టిని మళ్ళించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. సుశాంత్‌ని హత్య చేయడానికి వారికి పెద్ద మొత్తంలో డబ్బు అంది ఉండొచ్చు. అంతే కాకుండా ఎలాంటి కేసూ లేకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఈ హత్య కేసు నుంచి పోలీసులను దృష్టి మళ్లించడానికి హంతకులు సుశాంత్ ఖాతా నుంచి అనేక ఖాతాల్లోకి డబ్బు జమ చేయడానికి ప్రయత్నించారు. ముంబైలో పరిస్థితులు భయానకంగా మారిపోతున్నాయి. గ్యాంగ్స్టర్ల కారణంగా ప్రజలు బహిరంగంగా మాట్లాడటానికి సైతం భయపడుతున్నారు’’ అని ఎన్కే సూద్ వెల్లడించారు.
కాగా సుప్రీంకోర్టు సుశాంత్ మర్డర్ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించింది. సుశాంత్‌ది కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తామని సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకుల ట్వీట్ల గురించి తామేమీ స్పందించబోమని వెల్లడించింది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలను కూడా పట్టించుకోబోమని సీబీఐ బృందం వెల్లడించింది. నిపుణుల నివేదికల ఆధారంగా సమగ్రమైన దర్యాప్తును నిర్వహిస్తామని పేర్కొంది. ఈ కేసును తమకు ఇచ్చిన సమయంలోనే పూర్తి చేస్తామని సీబీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments