బీహార్‌ : నిర్మాణంలో వుండగానే కుప్పకూలిన బ్రిడ్జి .. కోట్ల రూపాయలు గంగపాలు, వీడియో వైరల్

  • IndiaGlitz, [Monday,June 05 2023]

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలు ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదాలు జరిగినా ఉలిక్కిపడుతున్నారు. తాజాగా బీహార్‌లో నిర్మాణంలో వున్న ఓ వంతెన కూలిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఖగారియా జిల్లాలో గంగానదిపై ‘‘అగువాని సుల్తాన్‌గంజ్ గంగా ’’ పేరుతో భారీ కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఖగారియా - అగువాని ప్రాంతాల మధ్య రాకపోకలకు అనువుగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీని అంచనా వ్యయం రూ.1717 కోట్లు. 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి వుండగా.. పలు కారణాల వల్ల 8 ఏళ్లు కావోస్తున్నా నేటికీ పూర్తి కాలేదు.

ఏప్రిల్ నెలలోనూ వంతెనకు ప్రమాదం:

మరోవైపు .. ఈ వంతెనకు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తుఫాన్ కారణంగా బ్రిడ్జి పిల్లర్లు దెబ్బతిన్నాయి. తాజాగా ఆదివారం ఏకంగా వంతెన కుప్పకూలడం కలకలం రేపింది. ప్రమాద దృశ్యాలను స్థానికులు మొబైల్స్‌లో వీడియో తీయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోవడం కలకలం రేపుతోంది. గతేడాది డిసెంబర్‌లో బెగుసరాయ్ ప్రాంతంలోని బుర్హి గండక్ నడిపై నిర్మించిన వంతెనలో కొంతభాగం కుప్పకూలింది.

బీహార్‌లో వరుసగా కుప్పకూలుతున్న బ్రిడ్జిలు :

అదే సంవత్సరం నవంబర్‌లో నలంద జిల్లాలో నిర్మాణంలో వున్న వంతెన కూలిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది సీఎం సొంత జిల్లా కావడం గమనార్హం. అలాగే కిషన్ గంజ్, సహర్‌షా జిల్లాల్లోనూ ప్రారంభానికి ముందే రెండు వంతెనలు కుప్పకూలాయి. ఈ ఘటనల నేపథ్యంలో విపక్షాలు సీఎం నితీష్‌పై విరుచుకుపడుతున్నాయి. సీఎం కమీషన్లకు అలవాటు పడ్డారని.. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది.

More News

ఇసుక మాఫియా చేతిలో జనసైనికుడి దారుణ హత్య .. ప్రశ్నిస్తే చంపేస్తారా : జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఇసుక మాఫియా చేతిలో సదాశివుని రాజేశ్ అనే జనసేన కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జనసేన వర్గాలు భగ్గుమంటున్నాయి.

ఓ ఇంటివాడైన శర్వానంద్.. రక్షితా రెడ్డితో ఏడడుగులు వేసిన హీరో, జైపూర్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి రక్షితా రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా శర్వా- రక్షితల వివాహం

'విమానం' అందరి కథే.. జీఎంఆర్ జీవితంలోనూ, ఆ కలే నేటి ఎయిర్‌పోర్ట్స్: కే. రాఘవేంద్రరావు ఎమోషనల్

శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు

Anasuya Bharadwaj: పెళ్లి రోజున భర్తతో కలిసి థాయ్ బీచ్‌లో రంగమ్మత్త.. వైట్ బికినీలో మామూలగా లేదుగా

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. తెలుగులో డిమాండ్ వున్న నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Chiranjeevi: ఫ్యాన్స్, సినీ కార్మికులకు క్యాన్సర్ టెస్టులు.. ఎన్ని కోట్లయినా ఇస్తా: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా