మామయ్యను చంపేశారు.. మా మేనత్త పరిస్థితి విషమంగా ఉంది: రైనా
Send us your feedback to audioarticles@vaarta.com
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సడెన్‌గా ఐపీఎల్ నుంచి వెనక్కి వెళ్లిపోవడం దానికి గల కారణాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదాన్ని అభిమానులకు తెలిపాడు. రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారని రైనా తెలిపాడు. తన అత్త మామలతో పాటు మరో ఇద్దరు బంధువులపై దాడి జరిగిందని వెల్లడించారు. పంజాబ్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని.. తన కుటుంబానికి ఏమైందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘పంజాబ్‌లోని మా మేనత్త ఇంటిపై భయంకరమైన దాడి జరిగింది. దాడిలో మామయ్య చనిపోయారు, మేనత్త తీవ్రంగా గాయపడింది. ఇద్దరు కజిన్స్‌లో ఒకరు నిన్న రాత్రి చనిపోయారు. ప్రస్తుతం మా మేనత్త పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసినది ఎవరనేది కానీ.. కారణమేంటన్నది తెలియరాలేదు. కుటుంబంలో ఎమర్జెన్సీ ఉండడంతో ఐపీఎల్ నుంచి వెనక్కి వచ్చా. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పంజాబ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన వారి గురించి కనీస వివరాలు తెలుసుకునే అర్హత మాకు ఉందని భావిస్తున్నా. అలాంటి నేరగాళ్లు మరిన్ని నేరాలకు పాల్పడకుండా చూడాలి’’ అని రైనా వెల్లడించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com