తుగ్లక్ డైలాగులు చెల్లవు... రాజధాని మార్పు మీ ఇష్టం కాదు అంటూ జగన్ కు ఉమా వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయ్. ముఖ్యంగా టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర్ రావు జగన్ ను తుగ్లక్ తో పోల్చుతూ మీడియా ముందు ఓ విడియో ప్లే చేశారు.
దేశ రాజధాని మార్పుపై అప్పటి తుగ్లక్ ఏమన్నారో వినండి అంటూ వీడియో చూపించారు ఉమా. ఈ క్లిప్పింగ్ లో తుగ్లక్... రెండు మూడు రోజుల్లో రాజధానిని మారుస్తున్నామంటూ ప్రకటన చేస్తారు. అయితే మొన్నేగా రాజధానిని ఢిల్లీకి మార్చారు.. మళ్లీ రాజధాని మార్పేంటి అని ప్రశ్నిస్తారు ప్రజలు. అప్పుడు తుగ్లక్... నా ఇష్టం దేశ రాజధాని మధ్యలో ఉండాలని అప్పుడు మార్చాను.. సౌకర్యాలు లేవని ఇప్పుడు మారుస్తున్నాను... మీరు మాట్లాడాల్సిన అవసరం లేదంటాడు. ఇది వీడియో సారాంశం.
అయితే తుగ్లక్ కాలంలో రాచరిక వ్యవస్థ కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు చేశాడు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ... ఇప్పుడు రాజధానిని మీ ఇష్టారీతిన ఎలా మారుస్తారని ప్రశ్నించారు. రైతుల భూములు తిరిగిచ్చేస్తామని మీ మంత్రులు ఎలా మాట్లాడుతారు అన్నారు ఉమా.
దక్షిణాఫ్రికా రాజధానుల గురించి మాట్లాడిన జగన్.. అలా రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఆ దేశం ఎంత నష్టపోయిందో తెలుసుకోలేదా అని నిలదీశారు. ఆ దేశ అధ్యక్షుడే రాజధానుల విషయంలో విమర్శలకు దిగిన దాఖలాలు ఉన్నాయని... అయినా ఏపీని దక్షిణాఫ్రికాతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు ఉమా మహేశ్వర రావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com