బెస్ట్ రెస్టారెంట్ గా ఎక్సలెన్స్ 2015 అవార్డ్ అందుకున్న వులవచారు

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

తెలుగు సాంప్రదాయ వంటకాలను బోజనప్రియులకు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన రెస్టారెంట్ వులవచారు. జూబ్లీహిల్స్ లో2013 లో స్థాపించబడి 2015లో బెస్ట్ రెస్టారెంట్ గా ఎక్సలెన్స్2015అవార్డ్ అందుకున్న వులవచారు రెస్టారెంట్ రీసెంట్ గా 2017 సంవత్సరానికి గాను బెస్ట్ రెస్టారెంట్ గా అవార్డ్ ను అందుకుంది. ఈ సందర్భంగా వులవచారు ఫౌండర్స్ వినయ్ నరహరి,విజయ్ రెడ్డి లు మాట్లాడుతూ మా ఈ జర్నీ లో మమ్మలిని బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ తో గౌరవించిన గవరమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి,తెలంగాణ టూరిజం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ వులవచారు, రాజసంఘటి వంటి న్యూట్రిషన్ ఫుడ్ ను అందిస్తున్నాము. అలాగే 20000 మందికి అయినా క్యాటరింగ్ ద్వారా ఫుడ్ సప్లై చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము.అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు గాని ,హెల్మెట్ అవేర్నెస్ విషయం లోగాని, పలు సేవా కార్యక్రమాలు లో వులవచారు భాగస్వామి కావడం ఆనందంగా ఉంది అన్నారు.