బాలీవుడ్ లో ఉలవచారు బిర్యానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించి..తెరకెక్కించిన విభిన్న కధాచిత్రం ఉలవచారు బిర్యానీ. ఈ చిత్రం తెలుగు కంటే ముందు మలయాళంలో సాల్ట్ అండ్ పెప్పర్ టైటిల్ తో రూపొందింది. ఆతర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రీమేక్ చేసారు. ఈ మూడు భాషల్లో ఈ చిత్రాన్నిప్రకాష్ రాజ్ తెరకెక్కించడం విశేషం.
ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ మూవీలో నానాపటేకర్, శ్రియ, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి తడ్కా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com