ఉద్ఘర్ష మొదటి పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
డి క్రియేషన్స్ పతాకం పై సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వం లో డి మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహా నిర్మాతలు గా ఆర్ దేవరాజ్ నిర్మాతగా ఠాకూర్ అనూప్ సింగ్, ధన్సిక, కబీర్ దుహన్ సింగ్, శ్రద్ధ దాస్, తాన్యా హోప్ , బాహుబలి ప్రభాకర్, వంశి కృష్ణ వంటి భారీ తారాగణం తో తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలో నిర్మించబడుతున్న సినిమా ఉద్ఘర్ష. ఈ చిత్రానికి సంబందించిన మొదటి పోస్టర్ ను తెలుగు లో విడుదల చేసారు.
అనంతరం పాత్రికేయుల సమావేశం లో సహా నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ " నాకు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ 25 ఏళ్ళు గా పరిచయం. అయన ఎలాంటి దర్శకుడో నాకు చాలా బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది, ఈ సినిమా విజయం మీద మాకు చాలా నమ్మకం గా ఉన్నాం. త్వరలోనే సినిమా విడులవుతుంది" అని తెలిపారు.
ధన్సిక మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా తెలుగు. ఈ సినిమా ద్వారా మల్లి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవటం నాకు చాలా సంతోషం గా ఉంది. మా డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ గారు వన్ మాన్ ఆర్మీ, చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఇది తెలుగు తమిళ కన్నడ ఫిలిం, ఒకే సరి మూడు భాషలో నటించడం చాలా ఛాలెంజ్ గా ఉంది. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఈ సినిమా లో నేను హీరోయిన్ రోల్ ప్లే చేస్తున్నాను, విలన్ దగ్గర నుంచి హీరో నన్ను ఎలా కాపాడతాడు అనేదే కథ. మా నిర్మాత దేవరాజ్ గారు చాలా కష్టపడి నిర్మించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది అని భావిస్తున్నాను" అని అన్నారు.
ఠాకూర్ అనూప్ సింగ్ మాట్లాడుతూ "తెలుగు లో ఇది నా 4 వ సినిమా. యముడు 3, విన్నర్ మరియు పూరి గారి సినిమా చేశాను. ఈ సినిమాలో నేను విలన్ నా నటించను కానీ ఇప్పుడు ఈ సినిమా లో హీరో గా మీ ముందుకి వస్తున్నాను. నేను నటించిన సినిమా ల ద్వారా, స్టార్ హీరోలు అయినా అల్లు అర్జున్ , సూర్య గార్ల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సునీల్ కుమార్ దేశాయ్ గారు నేషనల్ అవార్డు గ్రహీత, అలాంటి టాలెంటెడ్ దర్శకుడి దగ్గర నేను పని చేయటం నా అదృష్టం . ఇది చాలా మంచి థ్రిల్లర్ సినిమా, మీఅందరికి నచ్చుతుంది అని భావిస్తున్నాను. టీజర్ చూసారు, నచ్చింది అని అనుకుంటున్నా, కూర్గ్, హైదరాబాద్ మరియు బెంగుళూరు లాంటి మంచి లొకేషన్స్ లో మేము షూటింగ్ చేసాం. మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కిషోర్, కబీర్ దుహన్ సింగ్, శ్రద్ధ దాస్, తాన్యా హోప్ , బాహుబలి ప్రభాకర్, వంశి కృష్ణ వంటి నటీనటులు నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది, అబ్బోరపరిచే ఫైటింగ్లు ఉన్నాయ్ మీఅందరికి ఈ సినిమా నచుతుంది అని భావిస్తున్నాను " అని అన్నారు.
దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ మాట్లాడుతూ "తెలుగు లో నాకు ఇది మొదటి చిత్రం. నా సినిమాలు కొని తెలుగు లో అనువాదం జరిగాయి. ఇప్పుడు ఈ సినిమా ఉద్ఘర్ష త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇది యాక్షన్ తో కూడిన ఒక్క సస్పెన్స్ థ్రిల్లర్. ఇది ఒక్క డిఫరెంట్ సబ్జెక్ట్ సినిమా. ఈ సినిమా లో పాటలు లేవు. ఎడిటింగ్ జరుగుతుంది, త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం. సినిమా మీ అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నాను" అని అన్నారు.
నిర్మాత ఆర్ దేవరాజ్ మాట్లాడుతూ "ఈ ఉద్ఘర్ష సినిమా చాలా డిఫరెంట్ సినిమా. రెగ్యులర్ సినిమా కాదు. ప్రతి సీన్ ఉత్కంఠం గా ఉంటుంది. విడుదలకు అని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com