కరోనా వార్‌లోనూ ఉద్ధవ్ థాక్రే వర్సెస్ రాజ్‌థాకరే!
- IndiaGlitz, [Saturday,April 25 2020]
కరోనా మహమ్మారి విస్తరిస్తుండటం.. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ తరుణంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన బ్రదర్స్.. సీఎం ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ అధినేత రాజ్‌థాకరే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇందుకు శివసేన శివసేన అధికారిక పత్రిక సామ్నా పత్రిక వేదికైంది.
అసలేం జరిగింది..!
వైన్ షాపులు తిరిగి ప్రారంభించాలని ఆయన చేసిన డిమాండ్‌ను ఎత్తి చూపుతూ ‘ఆయనకు తినే కంచం లాగే మద్యం గ్లాసు నిత్యవసరం కాబోలు’ అంటూ విమర్శించింది.
‘రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి మళ్లీ అనుమతివ్వండి. ప్రజలకు మద్యం చేరువ చేయడానికి నేను చెప్పడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పడిపోయాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలనే కారణంతోనే నేను ఈ డిమాండ్ చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో రాజ్‌థాకరే ప్రస్తావించారు.
సామ్నా వర్సెన్ ఇదీ..
అయితే దీనిపై సామ్నా ‘‘మీరు (రాజ్‌థాకరే) మద్యం దుకాణాలు తెరవాలని అంటున్నారు. నిజానికి ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. మరి ఇలాంటప్పుడు మద్యం అమ్మకం షాపులు తెరిచి ప్రయోజనం ఏముంటుంది? మద్యం షాపులు తెరవాలంటే తయారీ కంపెనీలు తెరుచుకోవాలి. కార్మికులు పని చేయాలి. వాళ్లకు ముడి సరుకు దొరకాలి. ఈ విషయం పట్టించుకోకుండా మద్యం షాపులు తెరవాలని పేర్కొంది. ఆయన డిమాండ్ చాలా గమ్మత్తుగా ఉంది. ఆహారంతో పాటు మద్యం కూడా నిత్యవసర సరుకే అని ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు ఉన్నారు. ఆయనకు అన్నం కంచం లాగే మందు గ్లాసు కూడా నిత్యవసర సరుకులాగే అనిపిస్తుందేమో’ అని సామ్నా విమర్శించింది.