సడన్ షాకిచ్చిన ఉదయభాను.. బిగ్‌బాస్-3 నుంచి ఔట్ ?

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

బిగ్‌బాస్-3 షో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోస్ట్, కంటెస్టెంట్ల విషయమై నిర్వాహకులు జోరు పెంచారు. కాగా ఇప్పటికే ‘ఇదిగో కంటెస్టెంట్ల జాబితా’.. ‘బిగ్‌బాస్-3కి హోస్ట్’ అంటూ మీడియా, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తాజాగా నటి, యాంకర్ ఉదయభాను గురించి ఓ న్యూస్ ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్-3లో రేణు దేశాయ్, వరుణ్ సందేశ్, శోభిత ధూళిపాల, కమల్ కామరాజు, హేమచంద్ర, గుత్తా జ్వాల, రఘు మాస్టర్‌తో పాటు ఉదయభాను పేరు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లు అందరితోనూ ‘మా’ టీవీ యాజమాన్యం మాట్లాడి.. రెమ్యునరేషన్ విషయం కూడా చర్చించినట్లు సమాచారం. అయితే చివరగా ఉదయభానును సంప్రదించగా ఆమె ఏకంగా రోజుకు ఒకటి కాదు రెండు లక్షలు డిమాండ్ చేసిందట. దీంతో నిర్వాహకులు ఒకింత కంగుతిన్నారట. ఈ లెక్కన పెట్టుకుంటే షో మొత్తం వంద రోజులు జరుగుతుంది గనుక.. ఉదయభానుకు మొత్తం రూ. 2 కోట్లు సమర్పించుకోవాల్సి వస్తుందన్న మాట. ఈ మొత్తం నగదు.. విన్నర్ ఫ్రైజ్ కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. దీంతో ఉదయభాను పక్కన పెట్టాలని నిర్వాహకులు అనుకుంటున్నారట. అయితే బిగ్‌బాస్-3లో ఈ యాంకర్‌ను బిగ్‌‌బాస్‌ హౌస్‌లోకి నిర్వాహకులు పంపుతారా..? లేకుంటే బయటే పెడతారా..? అనేది తెలియాల్సి ఉంది.

అంటే.. ఉదయభాను మినహా మిగిలిన కంటెస్టంట్ల రెమ్యునరేషన్ దాదాపు ఫిక్స్ అయ్యిందట. అయితే ఉదయభాను మాత్రం ఈ రేంజ్‌లో డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో ఎవర్ని తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. సో.. ఈసారి మాత్రం బిగ్‌బాస్-3 మంచి రక్తికంటించేలానే ఉంది. సో.. ఫైనల్‌గా ఎవరెవరు కంటెస్టెంట్లగా సెలెక్ట్ అవుతారో.. ఎవరు హోస్ట్‌గా ఎన్నికవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.