పవన్ చిత్రంలో ఉదయభాను?
Send us your feedback to audioarticles@vaarta.com
జల్సా, అత్తారింటికి దారేది వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. కుష్బూ, బొమన్ ఇరాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందని.. ఆ పాటలో ప్రముఖ యాంకర్ ఉదయభాను తళుక్కున మెరిసే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు త్రివిక్రమ్ రూపొందించిన జులాయి చిత్రంలోనూ ఉదయభాను టైటిల్ సాంగ్‌లో తళుక్కున మెరిసారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com