ఉదయ్ కిరణ్ బయోపిక్...?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ఉన్నట్టుండి స్టార్ డమ్ సంపాదించుకుని.. చూస్తుండగానే పాతాళానికి పడిపోయిన హీరోల్లో ఉదయ్‌కిరణ్ ఒకరు. డిప్రెషన్‌తో ఈయన ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఉదయ్‌కిరణ్‌ను హీరోగా చిత్రం సినిమాతో పరిచయం చేసింది దర్శకుడు తేజ.
'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస సినిమాలు ఉదయ్‌కిరణ్‌తోనే చేశాడు తేజ. రెండు మంచి హిట్స్ అయ్యాయి. తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఔనన్నా కాదన్నా' అనుకున్న స్థాయి విజయాన్ని దక్కించుకోలేదు. `చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలా వరుస హిట్స్‌తో ఉదయ్‌కిరణ్ స్టార్ డమ్‌ను సంపాదించుకున్నాడు.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి పిల్లను ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. చిరంజీవి మిడిలఖ డ్రాప్ అయ్యాడు ...పెళ్లి ఆగిపోయింది. అక్కడ నుండి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేకపోయాయి.
దాంతో ఉదయ్‌కిరణ్ మానసికంగా కుంగిపోయి.. డిప్రెషన్‌లోకి వెళ్లడం .. ఊహించని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యువ హీరో జీవితాన్ని తేజ సినిమాగా చేయనున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. 'యన్.టి.ఆర్' బయోపిక్ నుండి వైదొలిగిన తేజ ఇప్పుడు ఇలాంటి సినిమా చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments