ఉబర్‌తో మహీంద్ర డీల్ ఓకే.. 50 ఎలక్ట్రిక్ వాహనాలు రెడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర(ఎంఅండ్ఎం) లిమిటెడ్ మరో అడుగు ముందుకేసింది.! ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో మహీంద్రా విద్యుత్ వాహనాలను ఉపయోగించడానికి ఇరు సంస్థలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని మహీంద్రా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
గురువారం హైదరాబాద్‌లో ఈ వాహనాలను మహీంద్రా ఎలక్ట్రిక్ సిఇఒ మహేష్ బాబు జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. 50 విద్యుత్ వాహనాల(ఇవి)ను ఈ నగరంలో ఉపయోగించనున్నట్లు సీఇఒ తెలిపారు.
ఇదిలా ఉంటే అవసరాల నిమిత్తం నగరంలో క్యాబ్ సేవలు అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో 30 కామన్ ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఒప్పందం కుదరింది..
ఇ2ఒ ఫ్లస్ హ్యాచ్, ఈవెరిటో సెడాన్ మోడన్‌లను అందిస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో సైతం విస్తరించే ప్రణాళికలు, తద్వారా ఇవిలను మరింతగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను పెంచే దిశగా కృషి చేస్తున్నామని.
ఈ క్రమంలోనే ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహీంద్రాతో ఈ భాగస్వామ్యం ద్వారా ఉబర్ యాప్‌పై డ్రైవర్ పార్టనర్స్ ప్రత్యేక ప్యాకేజీ అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments