ఉబర్‌‌తో మహీంద్ర డీల్ ఓకే.. 50 ఎలక్ట్రిక్ వాహనాలు రెడీ!

  • IndiaGlitz, [Friday,April 26 2019]

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్‌ మహీంద్ర(ఎంఅండ్‌ఎం) లిమిటెడ్‌ మరో అడుగు ముందుకేసింది.! ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌లో మహీంద్రా విద్యుత్‌ వాహనాలను ఉపయోగించడానికి ఇరు సంస్థలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని మహీంద్రా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

గురువారం హైదరాబాద్‌లో ఈ వాహనాలను మహీంద్రా ఎలక్ట్రిక్‌ సిఇఒ మహేష్‌ బాబు జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. 50 విద్యుత్‌ వాహనాల(ఇవి)ను ఈ నగరంలో ఉపయోగించనున్నట్లు సీఇఒ తెలిపారు.

ఇదిలా ఉంటే అవసరాల నిమిత్తం నగరంలో క్యాబ్‌ సేవలు అందిస్తున్న పబ్లిక్‌, ప్రైవేటు సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో 30 కామన్‌ ఛార్జింగ్‌ స్టేషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఒప్పందం కుదరింది..

ఇ2ఒ ఫ్లస్‌ హ్యాచ్‌, ఈవెరిటో సెడాన్‌ మోడన్‌లను అందిస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో సైతం విస్తరించే ప్రణాళికలు, తద్వారా ఇవిలను మరింతగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ను పెంచే దిశగా కృషి చేస్తున్నామని.

ఈ క్రమంలోనే ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహీంద్రాతో ఈ భాగస్వామ్యం ద్వారా ఉబర్‌ యాప్‌పై డ్రైవర్‌ పార్టనర్స్‌ ప్రత్యేక ప్యాకేజీ అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

More News

అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు.

సందీప్ కిష‌న్ 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్'... మే 7న ఫ‌స్ట్ లుక్‌

సందీప్ కిష‌న్ న‌టిస్తున్న చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌'. తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మే 7న విడుద‌ల కానుంది.

వెంకటేష్‌, నాగచైతన్య ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్‌

లగ్జరీ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది.

నేటి తరానికి నవలా రూపంలో సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు'

పద్మభూషణ్ - సూపర్ స్టార్,  నటశేఖర హీరో కృష్ణ నిర్మించి నటించిన పద్మాలయా మూవీస్  భారీ చిత్రం  'మోసగాళ్లకు మోసగాడు' అప్పట్లో ఘనవిజయం

రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కుట్ర జరిగిందా!?

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.