'యు ట‌ర్న్‌' ట్రైల‌ర్ డేట్‌

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్‌ కన్నడ ఫిల్మ్ 'యు టర్న్' సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.భూమిక‌, ఆది పినిశెట్టి, రాహుల్ రవిచంద్రన్ కీలక పాత్రలు పోషించిన‌ ఈ సినిమా... సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. కాగా.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆగ‌స్ట్ 17న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

ఒక హైవేపై జరిగే వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీని చేధించే నేపథ్యంలో.. పోలీసులకు ఓ జర్నలిస్ట్ ఏ విధంగా సాయపడిందో తెలిపే ఇతివృత్తమే ఈ సినిమా. కన్నడ వెర్ష‌న్ డైరెక్ట‌ర్‌ పవన్ కుమార్ ఈ బైలింగ్వ‌ల్ మూవీని కూడా రూపొందించారు.