మల్టీ స్టారర్ మూవీలో 'యు- టర్న్' భామలు
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలింలో నాగార్జున డాన్‌గా నటించనున్నారు. ఇక డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఇదిలా ఉంటే...ఈ సినిమాలో నాగ్‌కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్ పేరును పరిశీలిస్తున్నారు.
తమిళ చిత్రం 'విక్రమ్ వేద', కన్నడ చిత్రం 'యు టర్న్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీ పేరును లాంచింగ్ రోజు అంటే ఫిబ్రవరి 24న అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంగా సాగే కథలో నాగ్, శ్రద్ధా సన్నివేశాలు వస్తాయని సమాచారం. అలాగే నాని సరసన సమంత నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలు గనక నిజమైతే 'యు టర్న్' భామలిద్దరూ ఈ సినిమాలో సందడి చేసే అవకాశం ఉన్నట్టే. ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్రీగా ఉన్నారు. ఇక వర్మ సినిమాలో నాగార్జున బిజీగా ఉన్నప్పటికీ...ఈ మల్టీస్టారర్ మూవీ కోసం కాల్ షీట్స్ కేటాయించారని సమాచారం. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com